Advertisementt

ప్లాప్ సినిమా స్టోరీతో ‘పడి పడి లేచె మనసు’?

Fri 14th Dec 2018 12:43 PM
sharwanand,sai dharam tej,movies,padi padi leche manasu,tej i love u  ప్లాప్ సినిమా స్టోరీతో ‘పడి పడి లేచె మనసు’?
Padi Padi Leche Manasu is Flop Movie Story ప్లాప్ సినిమా స్టోరీతో ‘పడి పడి లేచె మనసు’?
Advertisement
Ads by CJ

ఈనెల 21 న రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ఒకటి వరుణ్ తేజ్ నటించిన ‘అంతరిక్షం’..ఇంకోటి శర్వానంద్ ‘పడి పడి లేచె మనసు’. రెండూ సపరేట్ జోనర్స్ కాబట్టి దేనికి ఏది పోటీ కాదు. సో కలెక్షన్స్ పరంగా ఇబ్బందే లేదు. అయితే యూత్ లో క్రేజ్ ఉన్న చిత్రం మాత్రం ‘పడి పడి లేచె మనసు’. టీజర్..సాంగ్స్ యూత్ బాగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. మరో అంశం ఏంటంటే ఇందులో సాయి పల్లవి హీరోయిన్.

అయితే ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈ సినిమా స్టోరీ సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘తేజ్ ఐ లవ్ యు’ స్టోరీ ఒకటే అని టాక్ నడుస్తుంది. హీరో శర్వానంద్ అనుకోకుండా జరిగిన సంఘటన వల్ల తన గతాన్ని మర్చిపోతాడట. సంఘటన జరగక ముందు సాయి పల్లవిని ప్రేమిస్తాడు హీరో. కానీ తన గతాన్ని మర్చిపోవడం వల్ల సాయి పల్లవిని సైతం గుర్తుపట్టలేని పరిస్థితి వస్తుందట.

దీంతో సాయి పల్లవి అదో ఛాలెంజ్ గా భావించి ఆమె హీరోని మళ్ళీ కొత్తగా ప్రేమలో పడేలా చేయడమే ‘పడి పడి లేచె మనసు’ స్టోరీ అని చెబుతున్నారు. సేమ్ ‘తేజ్ ఐ లవ్ యు’ స్టోరీ కూడా ఇదే. కాకపోతే ఇందులో హీరోయిన్ అనుపమ తన గతాన్ని మర్చిపోతుంది. అయితే డైరెక్టర్ హను రాఘవపూడి స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేసి అది తలపుకు రాకుండా జాగ్రత్త పడినట్టు ఇన్ సైడ్ టాక్. అందుకే కొన్నికొన్ని సార్లు రీషూట్ జరుగుతుందని టాక్. మరోపక్క ‘తేజ్ ఐ లవ్ యు’ కి, ఈ సినిమాకి మూడు నెలలు గ్యాప్ ఉంది కాబట్టి ఆ సినిమా స్టోరీ మర్చిపోయే అవకాశముందని అందుకే యూనిట్ సభ్యులు పెద్దగా టెన్షన్ పడట్లేదని తెలుస్తుంది.

Padi Padi Leche Manasu is Flop Movie Story:

Similarity Between Sharwanand and Sai Dharam Tej Movies

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ