Advertisementt

విజయ్ మళ్ళీ మళ్ళీ తప్పుచేస్తున్నాడా?

Fri 14th Dec 2018 11:53 AM
vijay deverakonda,telugu,tamil,bilingual movie  విజయ్ మళ్ళీ మళ్ళీ తప్పుచేస్తున్నాడా?
Vijay Deverakonda Another Bilingual? విజయ్ మళ్ళీ మళ్ళీ తప్పుచేస్తున్నాడా?
Advertisement
Ads by CJ

'పెళ్లి చూపులు' హీరో విజయ్ దేవరకొండ తెలుగులో స్టార్ హీరో గా అతి తక్కువ సమయంలో మారడమే కాదు.. లేటెస్ట్ గా తమిళ భాషలో ఎంట్రీ ఇచ్చి 'నోటా' అనే సినిమా చేసి పరాజయం పొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తమిళంలోనే కాదు... తెలుగులో కూడా డిజాస్టర్ అయింది. దాంతో విజయ్ దేవరకొండ ఇప్పట్లో తమిళ ఇండస్ట్రీ వైపు కన్ను వేయడు అనుకున్న టైములో మరోసారి తమిళ చిత్రానికి ఓకే చేసాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో నడుస్తుంది. విజయ్ దేవరకొండ ఈ చిత్రాన్ని కూడా ద్వి భాషా చిత్రంగానే చేస్తున్నాడు. విజయ్ నటించనున్న బైలింగ్యువల్ మూవీని డ్రీం వారియర్ పిక్చర్స్ అధినేత ఎస్ ఆర్ ప్రభు నిర్మించనున్నారని సమాచారం . 

ఇక అన్ని ఒకే అనుకుంటే కొత్త దర్శకుడు శ్రీ కార్తీక్ డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రంలో తమిళ రైజింగ్ కమెడియన్ యోగిబాబు నటించనున్నాడని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈ చిత్రంపై త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. విజయ్ ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘డియర్ కామ్రేడ్’ అనే సినిమాతో పాటు ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫేమ్ క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తయిన తరువాత ఈ చిత్రాన్ని తమిళ డైరెక్టర్ తో సెట్స్ మీదకు తీసుకుని వెళ్తాడు విజయ్. ఇక ఈ బైలింగ్యువల్ మూవీలో విజయ్ కి జోడిగా ఎవరు నటిస్తారో తెలియాల్సిఉంది. మరి 'నోటా' తో డిజాస్టర్ అందుకున్న విజయ్ వెంటనే మళ్లీ తమిళ సినిమాలపై ఎందుకు పడ్డాడో అర్ధం కావట్లేదు. 

Vijay Deverakonda Another Bilingual?:

Vijay Deverakonda's Telugu-Tamil Bilingual Soon!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ