హీరోయిన్ కెరీర్ లు కొవ్వొత్తి లాంటివని తెలుసు కానీ.. శ్రియ విషయంలో ఆ కొవ్వొత్తు మరీ తొందరగా కరిగిపోయిందేమో అనిపిస్తుంది. ఆమెతోపాటు ఇండస్ట్రీకి వచ్చిన కాజల్, తమన్నాలు ఇంకా హీరోయిన్స్ గానే చలామణి అవుతుండగా.. అందం విషయంలో వాళ్ళిద్దరి కంటే అయిదారాకులు ఎక్కువగానే చదివిన శ్రియ మాత్రం అప్పుడే ఆంటీ క్యారెక్టర్స్ కి సిద్ధమైపోతోంది. శ్రియకి నా అల్లుడు సినిమాలో అత్తగా నటించిన రమ్యకృష్ణ ఇప్పటికీ తల్లి పాత్రల్లో ఫుల్ ఫామ్ లో ఉన్న తరుణంలోనే శ్రియ తల్లి పాత్రకు సై అనడం ఆమె అభిమానులకు బాధాకరమైన విషయం.
పెళ్లి అనంతరం కొంత విరామం తీసుకొని ఇటీవల వెంకటేష్ సరసన ముచ్చటగా మూడోసారి వెంకీ మామ సినిమా సైన్ చేసిన శ్రియ ఆ చిత్రంలో చైతన్యకి అత్తగా కనిపించనుంది. నాగచైతన్యకి అత్తగా కనిపించడం అటుంచితే.. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ కి ఆమె తల్లి వరస అవుతుంది. సో ఇప్పుడు వెంకీ మామ సినిమాలో శ్రియను రకుల్ ఆంటీ అంటుందా అని అప్పుడే శ్రియ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అందరూ బెంగ పెట్టేసుకున్నారు.
నిజానికి.. ఫిజిక్ పరంగా చూసుకున్నా, గ్లామర్ పరంగా చూసుకున్నా రకుల్ కంటే శ్రియ ఏ విషయంలోనూ తక్కువ కాదు. పైపెచ్చు కొన్ని యాంగిల్స్ లో రకుల్ కంటే శ్రియ సూపర్ సెక్సీగా కనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం వెంకీ మామలో ఆ కాంబినేషన్ ను చూడక, ఆ పిలుపును వినక తప్పదు మరి.