మీడియాకి ఎప్పుడూ ఓ ముప్పై అడుగుల దూరంలో ఉండే మహేష్ బాబు.. వాళ్ళని ఇబ్బందికి గురి చేయడం ఏంటా అనుకొంటున్నారా. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ప్రస్తుతం మహేష్ బాబుని తిట్టుకోని మీడియా మెంబర్ లేడంటే అతిశయోక్తి కాదు. ఇంతకీ మీడియా సభ్యులు మహేష్ బాబును అంతగా తిట్టుకోవడానికి కారణం ఏంట్రా అనుకుంటున్నారా. ఆయన కొత్తగా ప్రారంభించిన ఎ.ఎం.బి సినిమాసే అందుకు కారణం, మహేష్ మల్టీప్లెక్స్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి.. మీడియా అతడ్ని తిట్టుకోవడానికి సంబంధం ఏమిటా అని మళ్ళీ ఆలోచించేస్తున్నారా.
ఇంతకీ విషయం ఏంటంటే.. మహేష్ డిసెంబర్ మొదటివారంలో తన మల్టీప్లెక్స్ ను ఆరంభించినప్పటి నుండి పీఆర్వోలు చాలా ప్రెస్ మీట్స్ మరియు స్పెషల్ షోస్ అక్కడే ఆర్గనైజ్ చేస్తున్నారు. ముఖ్యంగా నమ్రత శిరోధ్కర్ తమ బిజినెస్ డెవలప్ మెంట్ కోసం ఫ్రీగా కొన్ని ప్రీమియర్ షోస్ మరియు ప్రెస్ మీట్స్ ను ఆర్గజైన్ చేయిస్తోంది అని తెలుస్తోంది. ఆ కారణంగా ట్రైలర్ లాంచ్ లు మొదలుకొని సినిమాల ప్రీమియర్ షోస్ వరకూ అన్నీ ఎ.ఎం.బి సినిమాలోనే జరుగుతున్నాయి.
ఆ మల్టీప్లెక్స్ ఏదో జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ కనీసం మాధాపూర్ లో ఉన్నా పెద్ద ఇబ్బంది ఉండేది కాదు, ఏకంగా కొండపూర్ జంక్షన్ లో ఉంది. అంత దూరం వెళ్ళడం కంటే అక్కడ ట్రాఫిక్ లో జర్నీ చేయడానికి చాలా ఇబ్బందులుపడుతున్నారు మీడియా సభ్యులు. ఏదో నెలకోసారి అంటే అనుకోవచ్చు కానీ.. రోజు విడిచి రోజు ఆ మల్టీప్లెక్స్ లో ఏదో ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తుండడంతో మీడియా మొత్తం నానా ఇబ్బందులు పడుతోంది.
మల్టీప్లెక్స్ రిచ్ లుక్ తో స్పేసియస్ గా ఉన్నప్పటికీ.. చుట్టూ ట్రాఫిక్ మరియు మీడియా ఆఫీసుల నుండి 20 కిలోమీటర్లకు పైగా దూరంగా ఉండడంతో పాపం దిక్కుతోచని స్థితిలో పాత్రికేయ మిత్రులు "మహేష్ బాబు మల్టీప్లెక్స్ బిజినెస్ కి వేరే ప్లేసే దొరకలేదా" అని తిట్టుకొంటున్నారట. మరి ఈ విషయాన్ని మహేష్, నమ్రతలు గ్రహించి ఈ డైలీ సర్వీసులను కాస్త తగ్గిస్తే బెటర్.