Advertisementt

చరణ్ కి బాలీవుడ్ హీరోయిన్ ఫిక్సయ్యింది

Thu 13th Dec 2018 08:46 PM
ram charan,boyapati,vinaya vidheya rama,esha gupta,item song  చరణ్ కి బాలీవుడ్ హీరోయిన్ ఫిక్సయ్యింది
Bollywood Hottie Fixed for Ram Charan చరణ్ కి బాలీవుడ్ హీరోయిన్ ఫిక్సయ్యింది
Advertisement
Ads by CJ

చరణ్ కి హీరోయిన్ ఫిక్స్ అయ్యింది అంటే రాజమౌళి సినిమాలో నటిస్తున్న చరణ్ సరసన హీరోయిన్ ఫిక్స్ అయిపోయిందేమోనని మీరు ఫిక్స్ అయిపోకండి. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది చరణ్ ప్రస్తుతం నటిస్తున్న వినయ విధేయ రామ సినిమా గురించి. అదేంటి అందులో ఆల్రెడీ బాలీవుడ్ ముద్దుగుమ్మ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది కదా అని మళ్ళీ డౌట్ మొదలైందా. ఇదే కంగారంటే మరి. కాస్త ఆ ఆలోచనకి గ్యాప్ ఇవ్వండి బాబు. బోయపాటి దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న వినయ విధేయ రామ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ కోసం గత కొన్నాళ్లుగా హీరోయిన్స్ వేట సాగుతున్న విషయం తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా, కేతరీన్, కాజల్ అగర్వాల్ ల పేర్లు వినిపించినప్పటికీ.. వాళ్ళెవరూ ఫైనల్ అవ్వలేదు. చరణ్ అండ్ టీం ఇలియానాపై మక్కువ చూపినప్పటికీ ఆమె ఏకంగా 60 లక్షల రెమ్యూనరేషన్ అడగడంతో ఆ ఆప్షన్ ను వదిలేశారు. 

ఎట్టకేలకు బాలీవుడ్ హాట్ బ్యూటీ ఈషా గుప్తాను ఫైనల్ చేశారట. బాలీవుడ్ లో మోస్ట్ సెక్సీయస్ట్ హీరోయిన్స్ లో ఒకరైన ఈషా గుప్తాకి ప్రస్తుతం అక్కడ పెద్దగా ఆఫర్లు కూడా ఏమీ లేవు. ఇటీవల సచిన్ జోషితో కలిసి ఒక తెలుగు, తమిళ బైలింగువల్ సినిమా చేసింది. ఇప్పుడు బోయపాటి సినిమాలో ఐటెమ్ సాంగ్ ఆఫర్ రావడంతో వెంటనే ఒప్పేసుకొందట ఈషా గుప్తా. 

జానీ మాస్టర్ నేతృత్వంలో తెరకెక్కనున్న ఈ స్పెషల్ సాంగ్ షూట్ కోసం ఆల్రెడీ అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ సెట్ రెడీగా ఉందట. ఇవాళ లేదా రేపటి నుంచి చిత్రీకరణ మొదలవ్వొచ్చు. ఇన్సైడ్ సోర్సస్ ప్రకారం ఈ సాంగ్ 2019 బెస్ట్ మరియు హాట్ ఐటెమ్ సాంగ్ గా నిలిచిపోయేలా బోయపాటి ప్లాన్ చేస్తున్నాడట. 

Bollywood Hottie Fixed for Ram Charan:

Bollywood Hottie Esha Gupta Signed Ram charans Vinaya Vidheya Rama for a Special Song

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ