Advertisementt

ఈ సినిమా ఆడితేనే.. లేదంటే ఈ భామ కష్టమే?

Thu 13th Dec 2018 08:45 AM
mehreen kaur,varun tej,venkatesh,f2 movie  ఈ సినిమా ఆడితేనే.. లేదంటే ఈ భామ కష్టమే?
Young Heroine Wants Hit for Her Future ఈ సినిమా ఆడితేనే.. లేదంటే ఈ భామ కష్టమే?
Advertisement
Ads by CJ

నానితో కలిసి కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మెహ్రీన్ కౌర్... అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ అవుతుంది అని అనుకున్నారు. అనుకున్నట్టుగానే మెహ్రీన్ ఎడా పెడా సినిమాలు చేస్తూ బాగా బిజీగా మారడమే కాదు.. బొద్దుగుమ్మగాను తయారైంది. ఇక మధ్యలో ఒకటి రెండు హిట్స్ వచ్చినా అవి మెహ్రీన్ కి పనికి రాలేదు. అయితే ఈ భామ మాత్రం సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉంది. ఇక ఈ ఏడాది మెహ్రీన్ చేసిన సినిమాలేవీ మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. కాస్త బరువు తగ్గి సినిమాలు చేసిన మెహ్రీన్ కి లక్కు కలిసి రాలేదు.

ఈ ఏడాది రవితేజతో కలిసి నటించిన రాజా ది గ్రేట్ కాస్త పర్వాలేదనిపించింది... గోపీచంద్ తో కలిసి నటించిన పంతం సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. అలాగే అందరికి హిట్స్ ఇస్తున్న విజయ్ దేవరకొండ కూడా మెహ్రీన్ కి హిట్ ఇవ్వలేకపోయాడు. విజయ్ దేవరకొండతో చేసిన నోటా అటు తమిళ్ లోను, ఇటు తెలుగులోనూ ప్లాప్ అయ్యింది. ఇక మిగిలిన బెల్లంకొండ కవచం మీదే ఆశలు పెట్టుకుంటే... తాజాగా ఆ సినిమా కూడా మెహ్రీన్ కౌర్ కి షాకిచ్చింది. అసలే సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్. అందులోను సినిమా ప్లాప్ అవడంతో.. మెహ్రీన్ బేజారెత్తిపోయింది.

ఇక వచ్చే ఏడాది మొదట్లో విడుదల కాబోతున్న ఎఫ్ 2 మీదే మెహ్రీన్ ఆశలన్నీ. వరుణ్ తేజ్, వెంకటేష్ కలయికలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న ఎఫ్ 2  ఫన్ అండ్ ఫ్రస్టేషన్‌లో తమన్నా, మెహ్రీన్ లు నటిస్తున్నారు. మరి సక్సెస్ ఫుల్ డైరెక్టర్, సక్సెస్ నిర్మాతలైన మెహ్రీన్‌కి హిట్ ఇస్తారో లేదో అనేది చూడాలి.

Young Heroine Wants Hit for Her Future:

Mehreen Kaur Hopes on Varun tej F2

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ