Advertisementt

ఎన్టీఆర్, చరణ్ లని బాగా ఇరికించేశాడుగా !

Thu 13th Dec 2018 08:31 AM
rajamouli,ram charan,ntr,rrr movie,shivering  ఎన్టీఆర్, చరణ్ లని బాగా ఇరికించేశాడుగా !
RRR: Rajamouli Shooting Without Bound Script ఎన్టీఆర్, చరణ్ లని బాగా ఇరికించేశాడుగా !
Advertisement
Ads by CJ

బాహుబలి తర్వాత రాజమౌళి మళ్ళీ భారీ బడ్జెట్ తో RRR ని పట్టాలెక్కించాడు. RRR అనౌన్స్ మెంట్ జరిగిన తర్వాత చాలా రోజులకి అంటే నెలల గ్యాప్ లో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి సెట్స్ మీదకెళ్ళాడు. నిర్మాత దానయ్య భారీ బడ్జెట్ పెడుతున్న ఈ చిత్రం ఇప్పటికే మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ చిత్రానికి గాను ఇద్దరు స్టార్ హీరోస్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు 200 రోజుల డేట్స్ కేటాయించారనే ప్రచారం ఉంది. ఇక ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడే ఎన్టీఆర్, రామ్ చరణ్ లు మరో రెండేళ్లు అభిమానులను కొత్త సినిమాలతో పలకరించే పరిస్థితి లేదనేశారు. ఎందుకంటే రాజమౌళి ఏ సినిమా అయినా అనౌన్స్ చేసి బరిలోకి దిగాడు అంటే గనక.. ఆ సినిమా అవుట్ ఫుట్ పర్ఫెక్ట్ అనుకుంటేనే ఫైనల్ చేస్తాడు లేదంటే ఎంత టైం కావాలో అంత టైం తీసుకుంటాడు. బాహుబలి విషయమే తీసుకోండి రెండు పార్టులు కలిపి దాదాపుగా ఐదేళ్ల టైం తీసుకున్నాడు రాజమౌళి. అందుకే అవుట్ ఫుట్ అంత పర్ఫెక్ట్ గా వచ్చింది.

ఇక RRR కోసం ఎంత టైం తీసుకుంటాడో అనుకున్న ప్రేక్షకులకు అప్పుడే రాజమౌళి షాకిచ్చాడు. మొదటి షెడ్యూల్ లో కేవలం ఒకే ఒక్క యాక్షన్ సీన్ చిత్రీకరించిన రాజమౌళి రెండో షెడ్యూల్ కోసం రెండు నెలలు టైం తీసుకున్నాడు. ఈ మధ్యలో కొడుకు కార్తికేయ పెళ్లి కానిచ్చేస్తాడు. RRR మొదలయ్యాక కొడుకు కార్తికేయ పెళ్లి పెట్టుకోవడంతో... RRR  కి పనిచేయాల్సిన రాజమౌళి కుటుంబం మొత్తం కార్తికేయ పెళ్లి పనుల్లో మునిగిపోయింది. ఈ నెలలోనే జరగనున్న కార్తికేయ పెళ్లి రాజస్థాన్ లో జరగనుంది. అందుకోసం రాజమౌళి ఫ్యామిలీ మొత్తం పెళ్లి పనులు చూసుకోవడంతో RRR సెకండ్ షెడ్యూల్ కి భారీ గ్యాప్ ఇచ్చారు.

ఈమధ్యలో RRR స్క్రిప్ట్ పూర్తికాలేదని.. అందుకే రాజుకొడుకు పెళ్లి పనులతో పాటుగా RRR  స్క్రిప్ట్ వర్క్ లో కూడా తల మునకలయ్యాడని చెబుతున్నారు. ఎప్పుడూ బౌండ్ స్క్రిప్ట్ ను చేతిలో పెట్టుకుని సినిమాని పట్టాలెక్కించే రాజమౌళి ఈసారి పూర్తి స్క్రిప్ట్ లేకుండా సెట్స్ మీదకెళ్లాడట. అందుకే ఆ స్క్రిప్ట్ పూర్తి చెయ్యడం కోసం ఫిబ్రవరి వరకు సెకండ్ షెడ్యూల్ మొదలెట్టడం లేదట. మరి ఈ లెక్కన ఎన్టీఆర్, రామ్ చరణ్ లు బాగా ఇరుక్కున్నారనిపిస్తుంది. ప్రభాస్ అంటే ఐదేళ్లు వేరే కమిట్మెంట్స్ పెట్టుకోకుండా బాహుబలి కోసం పనిచేశాడు కానీ.. ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్న ఈ ఎన్టీఆర్, చరణ్ లు రాజమౌళి కోసం ఎన్నాళ్ళు త్యాగం చెయ్యాలో అంటూ మెగా, నందమూరి ఫ్యాన్స్ వర్రీ అవుతున్నారు.

RRR: Rajamouli Shooting Without Bound Script:

Rajamouli Crazy Acts Shivering NTR, Charan  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ