‘గీత గోవిందం’ సక్సెస్ రష్మిక.. విజయ్ లకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టాయి. కానీ దాన్ని డైరెక్ట్ చేసిన పరశురాంకి మాత్రం ఇంతవరకు ఒక్క సినిమా కూడా ఓకే అవ్వలేదు. డైరెక్టర్ కి వచ్చిన పేరు కన్నా హీరో విజయ్ కే ఎక్కువ పేరు వచ్చింది. సినిమా క్రెడిట్స్ మొత్తం విజయ్ కి వెళ్లిపోవడంతో పరశురాంతో సినిమా చేయడానికి ఎవరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపట్లేదు.
‘గీత గోవిందం’ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. దర్శకుడు దగ్గర రెండు మూడు స్టోరీస్ ఉన్నా అవి హీరోకి నచ్చడం లేదని తెలుస్తుంది. అయితే తన ఫేవరెట్ కథానాయకుడు అల్లు అర్జున్ హీరోగా సినిమా చేయడానికి పావులు కదుపుతున్నాడు పరశురాం. తను ఏ కథ రాసుకున్నా ఫస్ట్ బన్నీకే చెప్పే పరశురాం బన్నీకే స్టోరీ చెప్పనున్నాడట.
ఆల్రెడీ బన్నీకి లైన్ చెబితే ఫుల్ స్టోరీ రెడీ చేసుకుని రమ్మని చెప్పాడట. ఒకవేళ ఈసినిమా ఓకే అయితే గీతా ఆర్ట్స్ బ్యానర్ పైనే సినిమా ఉంటుంది. మరి బన్నీ ఏమో త్రివిక్రమ్ తో చేయాలనీ చూస్తున్నాడు. ఒకవేళ పరశురాం సినిమా ఒప్పుకున్న త్రివిక్రమ్ సినిమా తరువాతే చేస్తాడు బన్నీ. మరి అప్పటివరకు పరశురాం ఖాళీగా ఉంటాడా? లేదా రెండు సినిమాలు ఒకేసారి చేస్తాడా? అన్న విషయాలపై క్లారిటీ రావాలి.