Advertisementt

33 ఏళ్ళ కుర్ర హీరో పెళ్లి భాజాలు!

Wed 12th Dec 2018 08:19 PM
sharwanand,sharwanand wedding  33 ఏళ్ళ కుర్ర హీరో పెళ్లి భాజాలు!
Sharwanand Marriage In 2019 33 ఏళ్ళ కుర్ర హీరో పెళ్లి భాజాలు!
Advertisement
Ads by CJ

హెడ్డింగ్ చూసి కొంపదీసి శర్వానంద్ మన మ్యాన్లీ స్టార్ శ్రీకాంత్ నటించగా సూపర్ హిట్ అయిన పెళ్లిసందడి సినిమాని శర్వా రీమేక్ చేస్తున్నాడా ఏంటి అని కంగారుపడుతున్నారా. అస్సలు పడకండి.. ఎందుకంటే శర్వా రెడీ అవుతోంది సినిమా కోసం కాదు.. పెళ్లి చేసుకోవడానికి. 33 ఏళ్ల శర్వానంద్ నిన్నమొన్నటివరకు రేపు మాపు అని చెప్పుకొచ్చినా పెద్దగా పట్టించుకోని అతడి తల్లిదండ్రులు ప్రస్తుతం శర్వా పెళ్లి విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారట. ఎట్టి పరిస్థితుల్లోనూ 2019లో శర్వానంద్ పెళ్లి చేసేయాలని ఫిక్స్ అయ్యారట. ఈ విషయమై ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ డిస్కషన్స్ మొదలెట్టారని.. శర్వా ఎప్పటిలానే ఇప్పుడొద్దు అని చెప్పినా పట్టించుకోకుండా శర్వానంద్ కోసం పెళ్లి సంబంధాలు చూడడం మొదలెట్టారట.

టాలీవుడ్లో ఒన్నాఫ్ ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కావడంతో శర్వానంద్ కోసం సంపన్న కుటుంబాలకు చెందిన అమ్మాయిల తల్లిదండ్రులు క్యూ కడుతున్నారట. దాంతో ఇప్పుడు ఎవర్ని సెలెక్ట్ చేయాలా అని మదనపడుతున్నారట శర్వా పేరెంట్స్. 

ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో పడి పడి లేచే మనసు చిత్రంతోపాటు.. సుధీర్ వర్మ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. బహుశా ఈ రెండు సినిమాల తర్వాత శర్వానంద్ తన పెళ్లి గురించి అధికారికంగా ప్రకటిస్తాడేమో. ప్రస్తుతానికి మాత్రం అంతా సీక్రెట్. ప్రెజంట్ మాత్రం డిసెంబర్ 21న విడుదలవుతున్న పడి పడి లేచే ప్రమోషన్స్ లో యమా బిజీగా ఉన్నాడు. రాథ లాంటి ఫ్లాప్ సినిమా తర్వాత వస్తున్న చిత్రం కావడంతో పోయిటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన పడి పడి లేచే మనసుపై చాలా ఆశలు పెట్టుకున్నాడు.

Sharwanand Marriage In 2019:

Sharwanand Marriage In 2019, Parents Searching For Bride

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ