అరవింద సమేత విడుదలకు ముందు తర్వాత త్రివిక్రమ్ కు రెస్పెక్ట్ విషయంలో చాలా తేడా వచ్చింది. ఆ సినిమా అవుట్ పుట్ దెబ్బకి త్రివిక్రమ్ సినిమాలు తీయడం మర్చిపోయాడనీ, ఆయన కాలంలో ఇంక్ ఇంకిపోయిందనీ చాలా మంది చాలా విధాలుగా నానా మాటలు అన్నారు. ఆ సినిమాతో వచ్చిన నెగిటివిటీ మొత్తాన్ని అరవింద సమేత చిత్రంతో కడిగిపారేశాడు గురూజీ అలియాస్ త్రివిక్రమ్ శ్రీనివాస్.
ఆ సినిమాను అంతమంది భారీ క్యాస్టింగ్ తో కేవలం 50 వర్కింగ్ డేస్ లో ఫినిష్ చేయడం అందర్ని విస్మయానికి గురి చేసింది. ఆ సినిమా రిజల్ట్ ను బట్టి మళ్లీ ఎప్పటిలానే స్టార్ హీరోలందరూ ఆయన కోసం క్యూ కడతారేమో అనుకున్నారు ఇండస్ట్రీ జనాలు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. తాను ప్రామిస్ చేసిన ప్రకారం బన్నీతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు త్రివిక్రమ్. అప్పటి నుంచి మొదలైంది అసలైన రచ్చ. తన మునుపటి సినిమాల రిజల్ట్స్ ను దృష్టిలో పెట్టుకుని బన్నీ బాబు త్రివిక్రమ్ ఏ కథ, పాయింట్ చెప్పినా నన్ను ఎగ్జైట్ చేయడం లేదని చెప్పడం మొదలెట్టాడు. దాంతో విసిగిపోయిన త్రివిక్రమ్ తన కెరీర్ లో మొదటిసారిగా రీమేక్ సినిమా చేయడానికి కూడా సరేనన్నాడు.
కొన్నాళ్లపాటు నీళ్లు నమిలిన బన్నీ.. ఫైనల్ గా ఆ రీమేక్ కి కూడా నో చెప్పాడు. దాంతో త్రివిక్రమ్ తాను ఫ్లాప్ కొట్టినప్పుఫు కూడా అవ్వనంతగా చిరాకు పడుతున్నాడు. అరవింద సమేత విడుదలై అప్పుడే 70 రోజులు పూర్తవుతుంది.. ఇప్పటివరకు తన తదుపరి సినిమాకి సంబంధించి ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. సో.. ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ ఎండ్ లేదా సంక్రాంతిలోపు తన తాజా సినిమా ప్రకటన ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడట. మరి అల్లు అర్జున్ ఈలోపు ఏదైనా కథను యాక్సెప్ట్ చేస్తాడో లేదో చూడాలి.