Advertisementt

ప్రెజర్ పెంచిన రామ్ చరణ్

Wed 12th Dec 2018 04:59 PM
ramcharan,vinaya vidheya rama  ప్రెజర్ పెంచిన రామ్ చరణ్
Ramcharan Acceleration For Vinaya Vidheya Rama ప్రెజర్ పెంచిన రామ్ చరణ్
Advertisement
Ads by CJ
>సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలవుతున్న వినయ విధేయ రామ. ఈ విషయం కొందరు కరడుగట్టిన మెగా అభిమానులు మరియు ఫిలిమ్ జర్నలిస్టులకు తప్ప కనీసం ఇండస్ట్రీ వర్గాలకు కూడా తెలియదేమో. మరి నిర్మాత దానయ్య గారు చేస్తున్న పబ్లిసిటీ అలా ఉంది. ఈ విషయమై బోయపాటి పలుమార్లు దానయ్యతో సీరియస్ గా చర్చించినప్పటికీ పెద్ద ఫలితం లభించలేదు. అందులోనూ షూటింగ్ ఇంకా చాలా పెండింగ్ ఉండడంతో బోయపాటి కూడా ఎక్కువ ఫోర్స్ చేయలేకపోయాడు.

>నిన్నమొన్నటివరకూ రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమా ఫస్ట్ షెడ్యూల్లో బిజీ అయిపోయిన రామ్ చరణ్ ఇప్పుడు ఆ షెడ్యూల్ ముగియడంతో మళ్లీ వినయ విధేయ రామపై కాన్సన్ ట్రేషన్ చేయడం మొదలెట్టాడు. ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి టీజర్ మరియు ఒక సాంగ్ తప్ప పోస్టర్ కూడా రిలీజ్ అవ్వలేదు.

>ఒక పక్క ఎన్.టి.ఆర్ బయోపిక్ యూనిట్ ఏమో వారానికి ఒక అప్డేట్ ఇస్తూ జనాల దృష్టిని తమవైపుకి తిప్పుకుంటోంది. ఈ పరిస్థితిని అర్ధం చేసుకున్న చరణ్ ఇమ్మీడియట్ గా ప్రమోషన్స్ మొదలెట్టమని ఆర్డర్ జారీ చేసాడట. దాంతో హుటాహుటిన ప్రమోషన్స్ వర్క్ స్టార్ట్ చేసేందుకు యుద్ధ ప్రాతిపదికిన రంగం సిద్ధం చేస్తున్నాడు దానయ్య. ఏదైనా మన నిర్మాతలు హీరోలు సీరియస్ అయితే తప్ప రియాక్ట్ అవ్వరు అనేది మరోసారి రుజువైంది.

Ramcharan Acceleration For Vinaya Vidheya Rama :

Ramcharan Acceleration For Vinaya Vidheya Rama: Sankranti Release, SPeed Of Shooting Increased 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ