నందమూరి బాలకృష్ణ తనకు తెలియదు అని నాగబాబు చెప్పడంతో స్టార్ట్ అయిన రచ్చ ఇంతవరకు ఆగలేదు. పైగా నిన్న నందమూరి ఫ్యాన్స్ ని మరింత రెచ్చకొడుతూ.. నేను బాలకృష్ణ తెలియదు అనడం తప్పే అని వెటకారంగా చెప్పడం... నాకు వల్లూరి బాలకృష్ణ తెలుసంటూ వీడియోను రిలీజ్ చేయడంతో.. మెగా ఫ్యాన్స్ - నందమూరి ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది.
ఇప్పటికే నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నాగబాబును దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే ఇప్పుడు వారి దృష్టిని ‘అంతరిక్షం’ సినిమాపైకి మరల్చారు. నాగబాబు కొడుకు హీరోగా వస్తున్న ‘అంతరిక్షం’ సినిమా ఈనెల 21 న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈనేపధ్యంలో ‘అంతరిక్షం’ సినిమా విడుదలను అడ్డుకుంటామని ప్రకటించాయి కొన్ని జిల్లాలకు చెందిన నందమూరి ఫ్యాన్స్ అసోసియేషన్లు.
దాంతో సోషల్ మీడియాలో గొడవ స్టార్ట్ అయింది. అటు మెగా ఫ్యాన్స్ కూడా ఏమి తగ్గకుండా చూద్దాం అని సవాళ్లు విసురుతున్నారు. దీంతో ‘అంతరిక్షం’ సినిమాకు కొత్త చిక్కులు మొదలయ్యాయి. ఒకవేళ సినిమాను విడుదల చేసినా.. నెగటివ్ టాక్ తో హోరెత్తించడానికి నందమూరి అభిమాన వర్గాలు ఇప్పటికే రెడీగా ఉన్నాయి. మరి ఈ గొడవ ఎంతవరకు వెళ్తుందో చూడాలి.