డౌట్ అక్కర్లేదు... తెలంగాణాలో మళ్లీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాజ్యమేలుతుందని.. చాలామంది నమ్మారు. వాళ్ళ నమ్మకాన్ని మళ్ళీ టీఆర్‌ఎస్ పార్టీ నిలబెట్టుకుంది. స్పష్టమైన మెజారిటీతో టీఆర్‌ఎస్ తెలంగాణలో క్లిన్ స్వీప్ చేసింది. కాంగ్రెస్ లోని మహామహులనే మట్టికరిపించింది. ప్రజకూటమిగా ఏర్పడి కేసీఆర్‌ని గద్దె దించాలనే ప్లాన్ బెడిసికొట్టింది. కేసీఆర్‌ని ఎవ్వరూ ఏం పీకలేరన్న కేటీఆర్ మాటలే నిజమయ్యాయి. అసలు గత మూడు నెలలుగా కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమన్న తరుణంలో ఎలక్షన్స్ డే రోజున.. అన్ని సర్వేలు టీఆర్‌ఎస్ కి అనుకూలంగా చెబితే... లగడపాటి సర్వే మాత్రం ప్రజకూటమి గెలుస్తుందని చెప్పడం... లగడపాటి సర్వేలు ఇప్పటివరకు నిజమవడంతో.. కాస్త టీఆర్‌ఎస్ నేతలు కంగారుపడినా.. ఆ కంగారుని బయటికి తెలియనివ్వలేదు.
అయితే ఎక్కడో ఏదో మూల ప్రజాకూటమి గెలుస్తుంది.. లగడపాటి సర్వే ఎప్పుడు తప్పుఅవ్వలేదనే వంకతో తెలంగాణ ఫలితాల మీద భారీగా బెట్టింగ్ లు కట్టారు. ఏమైంది చివరికి కేసీఆర్ స్పషమైన మెజారిటీతో మళ్ళీ తెలంగాణాలో టీఆర్‌ఎస్ జెండాని ఎగరేసాడు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు మొదటి నుండి టీఆర్‌ఎస్ గెలుపుమీద ధీమాతో ఉన్నారు. ఇక హరీష్ దేశ చరిత్రలోనే సుమారు లక్షా ఇరవై వేల ఓట్ల మెజారితో గెలుపొంది రికార్డు సృష్టిస్తే... ప్రజాకూటమిలో కాంగ్రెస్ అభ్యర్థులు పొన్నాల, డీకే అరుణ, సునీత లక్ష్మ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి ఇలా అందరూ ఓటమిపాలయ్యారు. ఇక అన్నిటికన్నా ఎక్కువ ఘోరం టిడిపి నుండి కాంగ్రెస్స్‌లోకి వెళ్లిన ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి 10 వేల ఓట్లతో ఓడిపోవడం. మరి చంద్రబాబు అనవసరంగా కాంగ్రెస్‌లో కలిసి పరువు పోగొట్టుకున్నాడా? లేక కాంగ్రెస్సే, టీడీపీతో కలిసి చేతులు కలిపి తమ హస్తాలను కాల్చుకుందా? ఇక బిజెపి గురించి ఈ ఎన్నికలలో ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఒక్కటంటే ఒక్కటి కూడా ఇప్పటి వరకు బిజెపి గెలవకపోవడం విశేషం. ఏది ఏమైనా తాజా పరిణామాలు చూస్తుంటే టీఆర్‌ఎస్ ముందు ప్రజాకూటమి, బిజెపి తలవంచాయనడంలో అతిశయోక్తి లేదు.