బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన ఐదు సినిమాలు యావరేజ్ దగ్గరే నిలిచిపోయాయి. ఒక్క సినిమా అంటే ఒక్క సినిమా కూడా హిట్ అవనేలేదు. ఎన్ని సినిమాలు హిట్ కాకపోయినా బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం ఎక్కడా తగ్గడమే లేదు. ప్రొడక్షన్‌లో కానీ, హీరోయిన్స్ విషయంలో గానీ ఎందులోనూ తగ్గడం లేదు. తండ్రి అండ చూసుకుని ఈ కుర్ర హీరో రెచ్చిపోతున్నాడు. తన మార్కెట్‌ని బట్టి సినిమాలు చేయడం మానేసి.. ప్రతి సినిమాకు 30 కోట్లకు పైనే ఖర్చు పెట్టిస్తున్నాడు. తన మార్కెట్‌ని బట్టే తనతో చేసే నిర్మాతలు మొత్తం భారీగా బడ్జెట్ పెట్టుకొస్తున్నారు(బెల్లంకొండ సురేష్ అండతోనే అనుకోండి). తాజాగా కవచం సినిమా కూడా ఆ యావరేజ్ కాదు కాదు ప్లాప్ లిస్ట్ లోకెళ్ళిపోయింది.
టాప్ హీరోయిన్స్‌ని నమ్ముకున్నా, భారీగా పెట్టుబడులు పెట్టినా, భారీ సెట్టింగ్స్‌తో ఆకట్టుకోవాలి అని చూసినా పని జరగడం లేదని బెల్లంకొండ ఎప్పుడు గ్రహిస్తాడో తెలియదు కానీ... ప్రస్తుతం కవచంతో పాటుగా లైన్‌లో పెట్టిన తేజ సినిమా మీద బెల్లంకొండ ఆశలు పెట్టుకున్నాడు. చాలా ప్లాప్ తర్వాత నేనే రాజు నేనే మంత్రితో మళ్ళీ ఫామ్ లో కొచ్చినా దర్శకుడు తేజతో బెల్లంకొండ తన తదుపరి ప్రాజెక్ట్‌తో కాజల్ అగర్వాల్ తో కలిసి సెట్స్ మీదకెళ్ళిపోయాడు. ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే సైలెంట్ గా ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది.
తేజ - బెల్లంకొండ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా మొత్తం కాజల్ అగర్వాల్ చుట్టూనే తిరుగుతుందని.... అందుకే ఈ సినిమాకి సీత అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. మరి బెల్లంకొండ కెరీర్‌ని డిసైడ్ చేసే సినిమా అది. మరి ప్రస్తుతానికి ఫామ్‌లో ఉన్న తేజ ఎప్పుడు ఎలాంటి సినిమా చేస్తాడో చెప్పలేం. అందుకే బెల్లంకొండ తన పరిధిలో బడ్జెట్ పెట్టుకుంటూ... తేజని ఎంత తక్కువ నమ్మితే అంత మంచిది అంటూ సెటైర్స్ సోషల్ మీడియాలో పడుతున్నాయి. చూద్దాం.. తేజ చేతిలో బెల్లకొండ భవిష్యత్తు ఎలా వుండబోతుందో అనేది.