ఒక రెండు రోజుల నుంచి నాగబాబు అదే పనిగా నందమూరి బాలకృష్ణను టార్గెట్ చేసి మరీ ట్రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై బాలకృష్ణ అభిమానులందరూ నాగబాబుని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపోస్తున్నారు. అయితే.. ఈ విషయంలో నందమూరి ఫ్యామిలీ నుంచి కానీ.. మెగా ఫ్యామిలీ ఎవరూ రెస్పాండ్ అవ్వడం లేదు. సాధారణంగా బాలయ్య ఇలాంటి విషయాలను అంత సులభంగా వదిలిపెట్టడు. కానీ.. నాగబాబు విషయంలో మాత్రం సైలెంట్ గా ఉన్నాడు. ఎప్పుడో ఏదో ఒక ప్రెస్ మీట్ లో రెస్పాండ్ అవుతాడు అది వేరే విషయం అనుకోండి. అయితే.. ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ అవ్వడం లేదబ్బా అని చిన్న ఇన్వెస్టిగేషన్ చేయగా.. పెద్ద విషయం తెలిసింది.
నిజానికి.. బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు అని నాగబాబు ఫస్ట్ కామెంట్ చేసినప్పుడే అది బాలకృష్ణ దృష్టికి వచ్చింది. వెంటనే రెస్పాండ్ అవుదామనుకుంటున్న తరుణంలో బాలయ్యకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మరియు తన బావ అయిన నారా చంద్రబాబు నాయుడు నుంచి ఫోన్ వచ్చిందట. ఎన్నికల సమయం ఎవరితోనూ విబేధాలు వద్దు.. కుదిరితే అందరినీ కలుపుకుంటూ పోవాలి కానీ.. ఎవరేమన్నా కొన్నాళ్లపాటు ఏమీ పట్టించుకోకు అని వారించాడట. దాంతో బాలయ్య శాంతిచాడని సమాచారం.
ఒకపక్క పవన్ కళ్యాణ్, మరోపక్క నాగబాబు ఇలా వరుసబెట్టి బాలయ్యను టార్గెట్ చేయడం వెనుక మాత్రం భారీ స్థాయి రాజకీయ గణాంకాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి బాలయ్య తన ముక్కు మీద కోపాన్ని ఎన్నాళ్లపాటు కంట్రోల్ లో ఉంచుకుంటాడో చూడాలి.