Advertisementt

అంబానీ సార్ ప్రభాస్ కి ఎంతిచ్చాడో మరి?

Tue 11th Dec 2018 03:05 PM
prabhas,ambani,isha ambani,bollywood  అంబానీ సార్ ప్రభాస్ కి ఎంతిచ్చాడో మరి?
How Much Ambani Paid to Prabhas అంబానీ సార్ ప్రభాస్ కి ఎంతిచ్చాడో మరి?
Advertisement
Ads by CJ

భారతదేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ కుమార్తె ఈషా అంబానీ పెళ్లి ఇటీవల ముంబైలో అత్యంత ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకి బాలీవుడ్, కోలీవుడ్ నుంచి టాప్ హీరోహీరోయిన్స్ మాత్రమే కాదు సినిమా పెద్దలు కూడా భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఏకంగా సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరో చేత సంగీత్ లో డ్యాన్స్ చేయించిన ఘనత, అది కూడా బ్యాగ్రౌండ్ లో కేవలం అంబానీకే దక్కింది. అటువంటి మోస్ట్ కాస్ట్లీయస్ట్ వెడ్డింగ్ కి ప్రభాస్ కూడా హాజరవ్వడం విశేషం. ఈ భారీ స్థాయి వెడ్డింగ్ కి హాజరైన ఒకే ఒక్క తెలుగు సెలబ్రిటీ ప్రభాస్. కరణ్ జోహార్ తో కాఫీ విత్ కరణ్ షో కోసం ముంబై వెళ్ళిన ప్రభాస్ ను అంబానీ పర్సనల్ గా పిలవడంతో కాదనలేక ఒకే చేప్పాడట. ఈవెంట్ కి అటెండ్ అయిన ప్రభాస్ తో ఫోటోలు దిగడం కోసం అంబానీ కుటుంబ సభ్యులతోపాటు బాలీవుడ్ స్టార్లు కూడా పోటీపడి మరీ లైన్ లో నిల్చున్నారు అది వేరే విషయం అనుకోండి. 

అయితే.. ఇప్పుడు ఈ విషయమై ఆసక్తికర చర్చ మొదలైంది. సాధారణంగా ఈ తరహా పెళ్లిళ్లకు హాజరవ్వడానికి స్టార్ హీరోలు భారీ మొత్తంలో డబ్బు తీసుకొంటుంటారు. అంబానీ ఫ్యామిలీ కూడా భారీ స్థాయి ఎమౌంట్స్ ఇవ్వడానికి పెద్దగా ఇబ్బందిపడరు. సొ, మరి పాన్ ఇండియా యాక్టర్ అయిన ప్రభాస్ కు అంబానీ ఎంత ఇచ్చి ఉంటాడు అనేది ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. కొందరేమో ప్రభాస్ క్యాజువల్ గా వెళ్తాడు కానీ.. అలా డబ్బు తీసుకొనే రకం కాదని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా.. ఒక తెలుగు హీరోకి అంబానీ ఫ్యామిలీ నుంచి ఇన్విటేషన్ రావడం అంటే గొప్ప విషయమనే చెప్పాలి.   

How Much Ambani Paid to Prabhas:

Buzz that Ambani Paid a huge amount to prabhas just to attend his daughters wedding.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ