ఇండస్ట్రీలో బెల్లంకొండ శ్రీనివాస్ రేంజ్ ఏమిటనేది.. ప్రతి సినిమాకి ప్రూవ్ అవుతూనే ఉంది. బెల్లంకొండ సురేష్ తన కొడుకుని స్టార్ హీరో చెయ్యడానికి నిర్మాతల చేత భారీగా ఖర్చు పెట్టించినప్పటికీ... ఆ సినిమాలు యావరేజ్ దగ్గరే ఆగిపోతున్నాయి. చివరికి బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు కొన్న బయ్యర్లు అంతో ఇంతో నష్టపోతూనే ఉన్నారు. అలాగే తన ప్రతి సినిమాని వేరే సినిమాల్తో పోటీకి దింపుతుంటాడు శ్రీనివాస్. మరి తన మీద తనకు కాన్ఫిడెన్సా.. లేదంటే ఓవర్ కాన్ఫిడెన్సా అర్ధమవడు . ఇక నిర్మాతలు కూడా సురేష్ అండ చూసుకుని శ్రీనివాస్ మార్కెట్ కన్నా ఒకింత ఎక్కువే ఖర్చు పెడుతున్నారు. తాజాగా కవచం సినిమాని కాస్త మీడియం రేంజ్ లో నిర్మించి... శుక్రవారం విడుదల చేశారు. మరి నిర్మాతలు కాస్త అలోచించి బడ్జెట్ పెట్టారు.. కానీ ఈ కవచం సినిమా కూడా ప్లాప్ అయినట్లే కనబడుతుంది.. కలెక్షన్స్ వాతావరణం చూస్తుంటే. ఇక సినిమా మొత్తం బెల్లంకొండ శ్రీనివాస్ ని హైలెట్ చేస్తూనే ఉందని.. అసలు ఈ హీరోకి ఇంత ఖర్చు అనవసరం అంటున్నారు ప్రేక్షకులు.
అలాగే సినిమాలో అక్కడక్కడా దుబారా ఖర్చు కూడా కొన్ని సన్నివేశాల్లో కనపడింది. అయితే నిర్మాతలు ఒక రేంజ్ లోనే కవచానికి ఖర్చు పెట్టాలనుకుంటే..... ఈ సినిమాకి కెమెరామెన్ గా పనిచేసిన స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు రిచ్ నెస్ కోసం విదేశాల్లో అనవసరపు సెట్స్ వేయించాడని ఫిలింసర్కిల్స్ లో గుసగుసలు బయలుదేరాయి. మరి బెల్లంకొండ సురేష్ కొడుకు కోసం టాప్ టెక్నీషియన్స్, టాప్ హీరోయిన్స్, టాప్ ప్రొడ్యూసర్స్ ని సెలెక్ట్ చేస్తాడు. ఇక కవచానికి కూడా చోటా కే ని ఎంపిక చేయడం... చోటా కూడా హీరో శ్రీనివాస్ రేంజ్ పెరగాలంటే అన్ని భారీగా కాస్ట్లీగా కనబడాలనే ఆలోచనతో కాస్త దుబారా ఖర్చు పెట్టించాడని ఆ గుసగుసల సారాంశం. మరి నిర్మాతలు కాస్త మీడియం బడ్జెట్ లో పనికానిచ్చేద్దాం అంటే.. చోటా కే మధ్యలో వేలెట్టి కెలికేశాడన్నమాట.