Advertisementt

మళ్లీ నాగబాబు దిగజారుడు మాటలు..!!

Tue 11th Dec 2018 08:09 AM
nagababu,balakrishna,comedian,social media  మళ్లీ నాగబాబు దిగజారుడు మాటలు..!!
Nagababu Insults Balakrishna Yet Again మళ్లీ నాగబాబు దిగజారుడు మాటలు..!!
Advertisement
Ads by CJ

గత రెండు రోజులుగా యూట్యూబ్ ఛానల్స్ లో, వెబ్ మీడియాలో, సోషల్ మీడియాలో మెగా హీరో నాగబాబు పేరు మార్మోగిపోతోంది. ఏ సినిమా హిట్ కొట్టో.... లేదంటే మరేదన్న విషయం మీదో కాదు నాగబాబుకి, బాలయ్య బాబు అదేనండి నందమూరి బాలకృష్ణ గురించి తెలియదని.. ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకి బాలయ్య బాబు గురించి చెప్పండి అనగా.. అసలు నాకు బాలయ్య బాబు ఎవరో తెలియదనేశాడు. అయినా ఆ యాంకర్ బాలయ్య బాబు తెలియకపోవడం ఏమిటండి అంటే.. దానికి వెంటనే నాగబాబు, బాలకృష్ణ తెలియకపోవడం ఏమిటండి... ఆయనో పెద్ద కమెడియన్.. పాత చిత్రాల్లో ఆయన కామెడీ ఎప్పటికి మర్చిపోలేం.. అంటే యాంకర్ ఆ బాలయ్య కాదండి... నందమూరి బాలయ్య అని అడగ్గా... దానికి నాగబాబు వెటకారంగా అసలు బాలయ్య ఎవరో తెలియదంటే ఆయన గురించి చెప్పమంటారేంటండి... అనేసరికి సదరు యాంకర్ కూడా మీరు ఇండస్ట్రీలో ఆర్టిస్టులుగా అంతా ఒకటే కుటుంబం.. కానీ పొలిటికల్ గా వేరే జోనర్స్ లో ఉన్నారు అని అయినా మాకెందుకు మీకు బాలయ్య బాబు గురించి ఇష్టం లేనపుడు అని కామ్ అయ్యాడు. ఇక నాగబాబు గారు బాలయ్యని తెలియదని అనడంతో నందమూరి ఫ్యాన్స్ వీర లెవల్లో రెచ్చిపోవడం.... నాగబాబుని ట్రోల్ చెయ్యడం మొదలెట్టేశారు.

మరి నాగబాబు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు. చీప్ గా పబ్లిసిటీ చేసుకుంటున్నాడా. లేదంటే ఇలాంటి మాటలు మాట్లాడితే పవన్ కళ్యాణ్ పిలిచి జనసేనలో ఎమ్యెల్యే టికెట్ ఇస్తాడని అనుకుంటున్నాడేమో అంటూ బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో నాగబాబుని ఒక ఆట ఆడుకుంటున్నారు. మరోపక్క బాలయ్య అభిమానులను నాగబాబు కావాలనే కెలుక్కుంటున్నాడని... ఇలా చీప్ పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నాడని అంటున్నారు. ఇక తాజాగా నాగబాబు మరోమారు ఫేస్ బుక్ లైవ్ లో బాలయ్యని ఆయన అభిమానులను రెచ్చగొట్టే మాటలు మాట్లాడాడు.

నాగబాబు తాను ఏం అనుకుంటున్నాడో అనేది ఒక వీడియో రూపంలో ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. బాలయ్య ఎవరో తెలియదు అనడం పెద్ద పొరబాటని.. తనని క్షమించండని... ఒక తప్పిదం దొర్లింది.. బాలకృష్ణ గారు తెలియదని మాట్లాడడంతో కొద్దిమంది సన్నిహితులు తనని హెచ్చరించారని.... చెప్పిన నాగబాబు.. బాలకృష్ణ గారు తెలియకుండా ఎవరుంటారండీ.. ఆయన పెద్ద కమెడియన్ అని ఆయనో మంచి నటుడని.. ఆయన హాస్యం కడుపుబ్బా నవ్విస్తుందని... అలాంటి హాస్యనటుడు బాలకృష్ణ గారిని నేను మర్చిపోయాననడం నిజంగా నా మిస్టేక్. పైగా ఆయన ఎన్టీఆర్ గారితో పనిచేసిన వల్లూరి బాలకృష్ణ గారు... కృష్ణ గారి అసాధ్యుడులో కూడా నటించాడు. ఇక వల్లూరి బాలకృష్ణ గురించి విక్కీ పీడియాలో కొడితే సమగ్రంగా తెలుస్తుందని.. ఇక ప్రస్తుతం ఆయన మన మధ్యన లేరని.. కొన్నాళ్ల క్రితం ఆయన మరణించారని.. వల్లూరి బాలకృష్ణ ఫొటోతో సహా నాగబాబు ఫేస్ బుక్ వీడియోలో బాలయ్య బాబు అభిమానులను కెలుక్కున్నాడు. మరి ఈ రచ్చ ఎక్కడివరకు దారితీస్తుందో అనేది ఇప్పుడే చెప్పడం కష్టం.

Nagababu Insults Balakrishna Yet Again:

Nagababu Says Balakrishna Is A Comedian

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ