సాహో ట్రైలర్ వచ్చేసిందా? ఏమో తెలియదు కానీ.. సాహో ట్రైలర్ ముచ్చట్లు మాత్రం సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఒక రేంజ్ లో చక్కర్లు కొడుతున్నాయి. సాహో ట్రైలర్ రష్ చూశారు, అబ్బో అద్భుతం అంటున్నారు. ఇంతకీ ప్రభాస్ - సుజిత్ కాంబోలో రెండేళ్లుగా తెరకెక్కుతున్న సాహో చిత్రం షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. గ్రాఫిక్స్ వర్క్ నాలుగు భాషల్లో ఒకేసారి తెరకెక్కడం, భారీ బడ్జెట్ మూవీ కావడంతో ఈ సినిమా షూటింగ్ నెమ్మదిగా సాగుతుంది. అయినా సాహో మీద ఎక్కడా అంచనాలు తగ్గకుండా సాహో టీం కష్టపడుతూనే ఉంది. సినిమా మొదలు కాకముందే సాహో టీజర్ విడుదల చేసిన సాహో టీం మొన్నీమధ్యనే సాహో మేకింగ్ వీడియో విడుదల చేసింది.
మరి సాహో మేకింగ్ వీడియోనే హాలీవుడ్ రేంజ్ లో కనబడుతుంటే సాహో సినిమా ఎలా వుండబోతుందో అనే క్యూరియాసిటీలో ప్రేక్షకులు ఉన్నారు. ఇక తాజాగా సాహో ట్రైలర్ విడుదలకు ఏర్పాట్లు మొదలయ్యాయట. అందులో భాగంగానే సాహో ట్రైలర్ రఫ్ కట్ చేశారట. అలా రఫ్ గా తీసిన ట్రైలర్ ని సాహో నిర్మాతలు సన్నిహితులకు చూపించారట. వారు సాహో రఫ్ కట్ చూసి ఏమన్నా మార్పులు చేర్పులు చెబితే... దాని ప్రకారం సాహో ట్రైలర్ విడుదల చెయ్యాలని వారు భావిస్తున్నారట. అయితే కనీసం సిజి వర్క్ లేకుండానే సాహో టీం ఒక భారీ సీనియర్ నిర్మాతకు ఈ సాహో ట్రైలర్ రఫ్ కట్ ని చూపించారట. ఆ రఫ్ కట్ చూసిన ఆ నిర్మాతకి దిమ్మతిరిగిందని టాక్.
సాహో లో ప్రభాస్ లుక్ అదుర్స్ అని, అతని యాక్షన్ సూపర్ అని ఆ నిర్మాత ఒకటే పొగడ్తల వర్షం కురిపించాడట. అయితే సదరు నిర్మాత ఎక్కువ పొగుడుతున్నాడేమో అనే డౌట్ లో సాహో టీం సాహో రఫ్ కట్ ని ఇంకా ఒకరిద్దరికి చూపించాలని డిసైడ్ అయ్యారట. మరి సాహో ట్రైలర్ ని మొదటిగా వీక్షించబోయే ఆ అదృష్టవంతులెవరో చూద్దాం. ఇక శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నుండి భారీ తారాగణమే నటిస్తుంది.