"బాలయ్య ఎవడు?. బాలయ్య ఎవడో నాకు తెలీదు" అని నాగబాబు ఓ యూట్యూబ్ చానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు నిన్న వైరల్ అవ్వడం.. నందమూరి అభిమానులందరూ నాగబాబుపై విరుచుకుపడడం తెలిసిందే. ఇదంతా ఏదో అనుకోకుండా జరిగిన విషయం కాదు. చాలా ప్రీప్లాన్డ్ గా నాగబాబు ఆడిన గేమ్ అని తెలుస్తోంది. నిజానికి ఇంటర్వ్యూకి ముందే యాంకర్ కి బాలయ్య గురించి క్వశ్చన్ అడగమని నాగబాబు చెప్పాడట. తాను ఇచ్చే రియాక్షన్ మాత్రం చెప్పలేదట. దాంతో ఇంటర్వ్యూలో భాగంగా బాలయ్య గురించి చెప్పండి అని అడిగిన యాంకర్ కూడా నాగబాబు రిప్లైకి ఒక్క నిమిషం పాటు షాక్ అయ్యాడు.
ఇదంతా నాగబాబు ఎందుకు చేశాడు అంటే.. ఇదివరకొకసారి బాలయ్యను ఒక రిపోర్టర్ "పవన్ కళ్యాణ్ పోలిటికల్ కెరీర్ గురించి చెప్పండి" అని అడిగితే "పవన్ కళ్యాణ్ ఎవడో నాకు తెలియదు" అని బాలయ్య చెప్పిన విషయం అప్పట్లో వైరల్ అయ్యింది. అందుకు ప్రతీకార చర్యగా నాగబాబు ఇలా చేసినప్పటికీ.. ఇలా ప్రీ ప్లాన్డ్ గా చేయడం అనేది సిగ్గుపడాల్సిన విషయం.
నిజానికి ఎలాంటి విషయంలోనూ తన వెర్షన్ ను చాలా నిర్భయంగా చెబుతుంటాడు నాగబాబు. అందుకు మెగా వేదిక మీద మెగా అభిమానులకు వార్నింగ్ ఇవ్వడమే నిదర్శనం. అలాంటి నాగబాబు ఇలా చీప్ పాలిటిక్స్ ప్లే చేయడం అనేది కడు శోచనీయం.