చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలేమో తమ వయసుకు తగ్గ కథానాయకి దొరక్క నానా ఇబ్బందులు పడుతుంటే.. వీళ్ళందరి కంటే సీనియర్ హీరో అయిన రజనీకాంత్ మాత్రం తన వయసులో సగం కాదు కదా. ఆ సగంలో సగం వయసున్న హీరోయిన్స్ తో నటించడానికి కూడా ఏ మాత్రం ఇబ్బందిపడడం లేదు. రీసెంట్ గా రోబో 2.0లో 26 ఏళ్ల పడుచు పిల్ల అమీ జాక్సన్ తో రొమాన్స్ చేసిన రజనీ.. "పెట్ట"లో త్రిషతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ మరో 26 ఏళ్ల ఆడపడుచుతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నాడు రజనీ.
"పెట్ట" అనంతరం రజనీకాంత్ క్లాస్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేయడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కథానాయికగా "మహానటి" ఫేమ్ కీర్తి సురేష్ ను ఎంపికైనట్లుగా కోలీవుడ్ వర్గాల సమాచారం. మురుగదాస్ మునుపటి చిత్రం "సర్కార్"లోనూ కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. ఇప్పుడు రజనీ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేయడంతో ప్రస్తుతం డైరెక్టర్ మురుగదాస్ కి కీర్తి ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది.
ఇకపోతే.. రజనీకాంత్ ఇలా తన వయసును బట్టి కాకుండా కథకు తగ్గట్లుగా కథానాయికలను ఎంపిక చేసుకోవడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. తాము కూడా ఇదే తరహాలో కథానాయికల ఎంపిక జరపాలేమోనని మిగతా హీరోలు కూడా ఆలోచిస్తున్నారు. ఏదేమైనా సూపర్ స్టార్ ట్రెండ్ సెట్టర్ అబ్బా.