'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' సినిమా దగ్గరనుండి గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న సందీప్ కిషన్ ఇప్పుడు ఏ సినిమా చేసినా వరస ప్లాప్స్ కొడుతూనే ఉన్నాడు. మొదట్లో కెరీర్ లో బిజీగా గడుపుతూ... హిట్స్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసిన సందీప్ మార్కెట్ ఇప్పుడు జీరో అన్నట్టుగా వుంది అతని సినిమాల పరిస్థితి. తమిళంలోనూ కలిసి రావడం లేదు. ఒక అమ్మాయి సినిమాతోనే సందీప్ కెరీర్ ముగిసిపోయింది అనుకుంటున్న తరుణంలోనే ఒకటి రెండు సినిమాలు చేసిన సందీప్ కి తాజాగా మరో భారీ డిజాస్టర్ పడింది.
హాట్ అండ్ గ్లామర్ భామ తమన్నాతో కలిసి నటించిన నెక్స్ట్ ఏంటి సినిమా కూడా ప్లాప్ అయ్యింది. మరి హీరోయిన్ తమన్నా గ్లామర్ కానీ, ఆమె క్రేజ్ కూడా సందీప్ ని ఒడ్డున పడెయ్యలేకపోయింది. కెమెరామెన్ చోటా కె నాయుడు మేనల్లుడిగా సినిమాల్లోకి అడుగు పెట్టిన సందీప్ పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. నెక్స్ట్ ఏంటి సినిమాతో ఫామ్ లోకి వద్దామనుకుంటే.. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు సందీప్ కిషన్, తమన్నా హీరోయిన్ అని ఈ సినిమా ఒప్పుకున్నాడు కానీ.. ఈ సినిమాలో అసలేం లేదంటున్నారు. శుక్రవారం విడుదలైన నెక్స్ట్ ఏంటి మిగతా సినిమాలన్నిటిలో ఘోరమైన పరిస్థితిలో ఉంది.
కవచం, సుబ్రమణ్యపురం సినిమాలకన్నా అతి దారుణమైన రేటింగ్స్ నెక్స్ట్ ఏంటికే వచ్చాయి. అసలా సినిమా మొదలైనప్పటి నుండి తమన్నా మీదే ఫోకస్ చేశారు దర్శకనిర్మాతలు. అలాగే పబ్లిసిటీ కార్యక్రమాల్లోనూ తమన్నానే హైలెట్ అయ్యింది కానీ సందీప్ ఎక్కడా కనబడలేదు. మరి యంగ్ హీరోని కాపాడేవారేమో గాని.. లేదంటే సందీప్ మరో నవదీప్ అయినా అవ్వొచ్చు అని అంటున్నారు. ఎందుకంటే నవదీప్ కూడా హీరో గా సినిమాలు మానేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసుకుపోతున్నాడు. మరి హీరోగా అవకాశాలు సన్నగిల్లుతుంటే ఏ విలన్ గానో లేదంటే పెద్ద హీరోల సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటున్నారు. చూద్దాం సందీప్ కెరీర్ ఏ మలుపు తిరుగుతుందో.