‘2.0’ చిత్రానికి భలే కలిసొస్తుంది. వీక్ అవుతున్న ఈ సినిమా ఈ వీక్ లో మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. ఈ శుక్రవారం నాలుగు తెలుగు స్ట్రెయిట్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. సుబ్రహ్మణ్యపురం..కవచం..నెక్స్ట్ ఏంటి..శుభలేఖ+లు. వీటిలో దేనికి సరైన టాక్ రాకపోవడంతో ‘2.0’ చిత్రానికి అది ప్లస్ అయ్యింది. సుమంత్ నటించిన ‘సుబ్రహ్మణ్యపురం’ ఒకటి పర్లేదు అనిపించుకుంది కానీ మిగిలిన సినిమాలన్నీ చేతులు ఎత్తేశాయి.
ఇక తెలంగాణ మొత్తం ఎలక్షన్స్ కాబట్టి అందరికి సెలవలు వచ్చాయి. పైగా స్కూల్స్ కు వరసగా శుక్రవారం నుండి ఆదివారం వరకు సెలవలు ఇచ్చేసారు. దాంతో ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం ‘2.0’ చిత్రానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పైగా ఇది 3D చిత్రం కావడం..పిల్లలకి ఈసినిమా నచ్చడంతో మల్టీప్లెక్సుల్లో ‘2.0’ థియేటర్లు నిండుగా కనిపించాయి.
‘2.0’ పక్కన పడితే ఈ శుక్రవారం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ..కాజల్ ..మెహ్రీన్ నటించిన ‘కవచం’కు మాత్రమే ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. మిగతా సినిమాల పరిస్థితి దయనీయంగా ఉంది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ‘2.0’, ‘కవచం’ తర్వాత ఎక్కువ వసూళ్లు వచ్చింది మూడు వారాల ముందు వచ్చిన ‘ట్యాక్సీవాలా’కే కావడం విశేషం. సో ఈవారం కూడా సినిమాల పరిస్థితి అంతంత మాత్రానే ఉంది కాబట్టి ఈ రెండు రోజులు ‘2.0’దే హవా అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ‘2.0’కు రెండో వారాంతంలో మంచి వసూల్ రావడం కాయం అని అంటున్నారు ట్రేడ్ నిపుణులు. నెక్స్ట్ వీక్ కూడా తెలుగులో పెద్దగా చెప్పుకునే సినిమాలు ఏమి రిలీజ్ అవ్వడం లేదు. దీని బట్టి చూస్తుంటే ‘2.0’ తెలుగులో సేఫ్ జోన్ లోకి వెళ్లే అవకాశాలు లేకపోలేదు.