Advertisementt

కాజల్ అందుకే బెల్లంకొండతో చేసిందా..?

Sun 09th Dec 2018 08:11 PM
kajal aggrwal,kavacham movie,sai srinivas,kajal role  కాజల్ అందుకే బెల్లంకొండతో చేసిందా..?
No Importance to Kajal Role in Kavacham Movie కాజల్ అందుకే బెల్లంకొండతో చేసిందా..?
Advertisement
Ads by CJ

కాజల్ అగర్వాల్.. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ఒకేసారి రెండు సినిమాలు ఒప్పుకుంది అంటే.. ఎవరూ పెద్దగా ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే బెల్లంకొండ శ్రీనివాస్ ఎప్పుడూ టాప్ హీరోయిన్స్ తోనే జోడి కడతాడు. అందుకే కాజల్.. బెల్లంకొండ సరసన అనగానే అందరూ ఓహో మళ్ళీ బెల్లంకొండ మరో టాప్ హీరోయిన్‌ని పట్టాడే అన్నారు. అయితే ఒకేసారి రెండు సినిమాల్లో కాజల్, బెల్లంకొండ  శ్రీనివాస్ సరసన ఒప్పుకుని కాస్త  ధైర్యం చేసిందనే చెప్పాలి. ప్రస్తుతానికి అవకాశాలు తగ్గుమొఖం పడుతున్న క్రమంలో ఇలా వచ్చిన అవకాశాన్ని అందుకుంటుందిలే అని సరిపెట్టుకున్నారు. కానీ బెల్లంకొండతో చేసిన తాజా చిత్రం ‘కవచం’లో కాజల్ అసలు ప్రాధాన్యత లేని పాత్రలో నటించిందనే చెప్పాలి. ‘కవచం’ సినిమా హీరో బెల్లంకొండ హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా ఉంది. అలాగే కాజల్ గ్లామర్ పాత్రకి తప్ప మరెందుకు ఉపయోగం లేని పాత్రలో నటించింది. అసలు ఇలాంటి పాత్ర కాజల్ ఎందుకు చేసింది అనుకునేలోపు.... కాజల్ ఎందుకు ఆ సినిమాని లైట్ తీసుకుందో కాస్త క్లారిటీ వచ్చేసింది.

తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన మరోసారి జోడి కడుతున్న కాజల్ అగర్వాల్.. ఆ చిత్రంలో కథ మొత్తం తన చుట్టూతానే తిరుగుతుంది. దానికి తగ్గట్టు అంటే... కాజల్ పాత్ర ఎంత ఇంపార్టెంట్ అయ్యిందో తెలిపే విధంగా సినిమాకి టైటిల్ గా కూడా ‘సీత’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారట. ఇక దర్శకుడు తేజ మొదట్లోనే బెల్లంకొండతో...  టైటిల్ కాజల్ పాత్రను బట్టి ఉంటుందని చెప్పినప్పటికీ....  బెల్లంకొండ శ్రీనివాస్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదట. మరి ఈ సినిమాలో తన పాత్ర ఇంపార్టెన్స్ ని బట్టి... ‘కవచం’ లో ఎలాగున్నా పర్వాలేదనుకున్నట్టుగా ఉంది. ఒక సినిమాలో బెల్లంకొండ కన్నా తనదే పై చెయ్యిలా ఉందిగా అని సరిపెట్టుకున్నట్టుగా ‘కవచం’ సినిమా చూశాక అర్ధమైంది. ప్రస్తుతం తేజ - బెల్లంకొండ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా జరుపుకున్నట్లుగా చెబుతున్నారు. అయితే ఇప్పుడు బయట చక్కర్లు కొడుతున్న ‘సీత’ టైటిల్ కన్ఫర్మ్ కాలేదని.. ఫైనల్‌గా కాజల్ హైలెట్ అయ్యేలా అయితే టైటిల్ ఉంటుందని మాత్రం టాక్ వినబడుతోంది.

No Importance to Kajal Role in Kavacham Movie:

Kajal did Kavacham movie for that reason

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ