భరత్ అనే నేను బహిరంగ సభకు సూపర్ స్టార్ మహేష్ బాబు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను తమ్ముడు అని, ఎన్టీఆర్ తన సీనియర్ అయిన మహేష్ బాబుని అన్న అని పిలిచినప్పుడు ఆడిటోరియం దద్దరిల్లిపోయిన విషయం ఇంకా సినిమా అభిమానులెవరూ మర్చిపోలేదు. మళ్ళీ అలాంటి మూమెంట్ ఈ నెలలోనే చోటు చేసుకోనుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ ఈవెంట్ కి కూడా గెస్ట్ మన జూనియర్ ఎన్టీయారే. కాకపోతే హోస్ట్ వేరు అన్నమాట. విషయం ఏంటంటే.. రామ్ చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వినయ విధేయ రామ ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించాలని చిత్రబృందం ఫిక్స్ అయ్యింది.
ఎప్పట్లానే ముఖ్య అతిధుల లిస్ట్ తయారు చేయడం మొదలెట్టింది. ఈ సినిమా నిర్మాత కూడా దానయ్య కావడంతో రాజమౌళి ఎలాగూ వస్తారు. ఆయనతోపాటు ఎన్టీఆర్ కూడా వస్తే బాగుంటుందని అందరూ అనుకోవడమే కాక చరణ్ కూడా ఫిక్స్ అవ్వడంతో వినయ విధేయ రామ ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యాడు.
టాలీవుడ్ లో ఫ్యాన్ వార్స్ తగ్గించడం కోసం ముందుకొచ్చిన ఇద్దరు స్టార్ హీరోస్ లో చరణ్ మరియు ఎన్టీఆర్ మొదటి వరుసలో నిలుస్తారు. అలాంటి ఈ ఇద్దరు స్టార్ హీరోస్ ఒకే స్టేజ్ ను పంచుకోనుండడంతో వాళ్ళ అభిమానుల్లో చెప్పలేనంత ఆనందం ఉరకలు వేస్తోంది.