ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> New Problems to Rajinikanth and Shankar 2.O Movie

రజినీ.. బయ్యర్లు భయపడిపోతున్నారు..!

ఒకప్పుడు సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే రెండు వారాలకి అటు..రెండు వారాలకి ఇటు సినిమాలను రిలీజ్ చేయాలంటే భయపడేవారు. కానీ రీసెంట్‌గా రిలీజ్ అయిన ‘2.0’ విషయంలో ఆ పరిస్థితులు ఏమి కనిపించడం లేదు. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఈ వారం నాలుగు సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యాయి. తమిళంలో కూడా మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి.

ఈసినిమాలని రిలీజ్ చేయడానికి ప్రొడ్యూసర్స్ ఏమి భయపడటం లేదు కానీ ‘2.0’ బయ్యర్లే భయపడే పరిస్థితి కనిపిస్తోంది. ‘2.0’‌కు పాజిటివ్ వచ్చి ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి కానీ ఈ చిత్రం ఒక వారం ఆడేస్తే సేఫ్ అయ్యే సినిమా కాదు. కనీసం రెండు మూడు వారాలైనా నిలబెట్టి ఆడాలి. ప్రస్తుతం ఈ సినిమా అటు తమిళంలో..ఇటు తెలుగులోనూ బ్రేక్ ఈవెన్‌కు చాలా దూరంలో ఉంది. ఇప్పటివరకు 50-60 శాతం మాత్రమే పెట్టుబడి రికవరీ అయినట్లు తెలుస్తుంది. ఇంకా చాలా అవ్వాల్సిఉంది.

కలెక్షన్స్ డల్ అవ్వడానికి మేజర్ కారణం ఈమూవీని 3D స్క్రీన్స్‌లో రిలీజ్ చేయడమే. తెలుగు, తమిళంలో 3D థియేటర్స్ చాలా తక్కువ. ఇప్పుడు మరో సమస్య ఈవారం రిలీజ్ అవుతున్న సినిమాలు. చిన్న స్థాయి సినిమాలే అయినప్పటికీ.. వాటికి పాజిటివ్ టాక్ వస్తే ‘2.0’ కలెక్షన్లపై ప్రభావం పడుతుందేమో అని భయపడుతున్నారు బయ్యర్లు. పైగా ఈ సినిమాలు రిలీజ్ అవుతుంటే ‘2.0’ కి స్క్రీన్స్ తగ్గిపోతాయి. తెలుగులో ఈవారం ‘కవచం’...‘సుబ్రహ్మణ్యపురం’.. ‘నెక్స్ట్ ఏంటి’.. ‘శుభలేఖ+లు’ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటి టాక్ ఎలా ఉన్నా.. ఒక వారం పాటు మాత్రం ‘2.0’ వసూళ్లపై ఎంతో కొంత ప్రభావం పడటం ఖాయం. అలాగే డిసెంబర్ 14న కూడా భారీగానే సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. అందుకే ‘2.0’ బయర్స్‌కు టెన్షన్ స్టార్ట్ అయిందట.

2.O Movie Buyers Feared with newly release movies

New Problems to Rajinikanth and Shankar 2.O Movie
rajinikanth
2 point o movie
buyers
fear
shankar
rajinikanth movies
loss