Advertisementt

ఆర్ ఎక్స్ 100, శుభ‌లేఖ‌లుకి మధ్య పోలికా..!!

Thu 06th Dec 2018 11:25 PM
shubhalekha+lu,rx100  ఆర్ ఎక్స్ 100, శుభ‌లేఖ‌లుకి మధ్య పోలికా..!!
Difference Between Rx100 and Shubhalekha+Lu ఆర్ ఎక్స్ 100, శుభ‌లేఖ‌లుకి మధ్య పోలికా..!!
Advertisement
Ads by CJ

ఇటీవల కాలంలో ఓ వెరైటీ టైటిల్‌తో ప్రేక్ష‌కులంద‌రిలో క్యూరియాసిటీని పెంచిన‌ చిత్రం శుభలేఖలు. పోస్టర్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ చాలా విభిన్నంగా ఉండటంతో అటు ఆడియన్స్‌లోనూ, ఇటు మార్కెట్‌లోనూ ఓ బ‌జ్‌ను సొంతం చేసుకున్నదీ చిత్రం. పుష్య‌మి ఫిల్మ్ మేక‌ర్స్ అధినేత బెల్లం రామ‌కృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని చూసి ఫ్యాన్సీ ఆఫ‌ర్స్‌ను వ‌ర‌ల్డ్ వైడ్ రైట్స్ ద‌క్కించుకుని గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.  హ‌నుమ తెలుగు మూవీస్ పతాకం పై రూపుదిద్దకున్న ఈ చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం రామానాయుడు స్టూడియోలో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను జ‌రుపుకుంది. ఇంకా అశోక్‌రెడ్డి, రాజ్‌కందుకూరిగారికి స‌న్మానం జ‌రిపారు.  విలేక‌రుల స‌మావేశంలో...

బెలంకొండ రామ‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ... మా ఆహ్వానాన్ని మ‌న్నించి ఇక్క‌డ‌కి వ‌చ్చిన అతిధులంద‌రికీ మా  శుభ‌లేఖ‌+లు టీమ్ త‌ర‌పున‌ కృత‌జ్ఞ‌త‌లు. ఈ చిత్రానికి మ్యూజిక్ చాలా బాగా కుదిరింది. మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా నిలిచే చిత్ర‌మిది. ఈ చిత్రం చూసిన త‌ర్వాత డైరెక్ట‌ర్ ఎవ‌రు అని నేను అడిగాను శ‌ర‌త్ గారు చాలా బాగా తీశారు ఈ చిత్రాన్ని. ఆయ‌న ఈ చిత్రం అంత బాగా రావ‌డానికి కార‌ణం ప్రొడ్యూస‌ర్స్ అన్నారు. మీరంద‌రూ ఈ చిత్రాన్ని చూసి ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను అన్నారు.

అప్పాజీ ఆర్టిస్ట్ మాట్లాడుతూ... నాది ఈ చిత్రంలో బ్యాలెన్స్‌డ్ పాత్ర‌లో న‌టించాను. అటు పెద్ద‌త‌ర‌హాగాను, ఇటు చిన్న‌వాళ్ళ‌ను అర్దం చేసుకునేలా ఉంటుంది నా పాత్ర‌.   ఈ చిత్రం టైటిల్ అలా రావ‌డానికి కార‌ణం ఈ చిత్రంలో చాలా ప్ల‌స్‌లు ఉన్నాయి. ఈ చిత్రానికి ప‌నిచేసిన టెక్నీషియ‌న్లు అంద‌రూ పెద్ద ప్ల‌స్‌లు. మీరంద‌రూ ఈ చిత్రాన్ని చూసి ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను అన్నారు.

హీరో శ్రీ‌నివాస్ సాయి మాట్లాడుతూ... ఈ స్టేజ్ మీద ఉన్న పెద్ద పెద్ద‌ల స‌పోర్ట్ మాకు చాలా అవ‌స‌రం. ఎందుకంటే చిత్రం రిలీజ్ కి ముందు ఎంత టెన్ష‌న్ ప‌డ‌తామో మీ అంద‌రికీ తెలిసిందే. అదే టెన్ష‌న్ ఇప్పుడు మాలోనూ ఉంది. మా డైరెక్ట‌ర్‌గారు సినిమాని చాలా బాగా తీశారు. ఆయ‌న చాలా కొత్త కొత్త థాట్స్‌తో మీ ముందుకు వ‌స్తారు. మా ప్రొడ్యూస‌ర్స్ ఎంత మంచి వాళ్ళంటే అంత మంచి వాళ్ళు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మేమంద‌రం కొత్త వాళ్ళం అయిన మా మీద న‌మ్మ‌కంతో తీశారు. బెల్లంకొండ రామ‌కృష్ణ‌గారిని చూసిన త‌ర్వాత మాకు ఇంకా కాన్ఫిడెంట్ లెవ్స్ బాగా పెరిగాయి. కెరియ‌ర్‌లో ఎవ‌రికైనా అప్ అండ్ డైన్స్ ఉంటాయి. కాని ఎలాగోలా ఈ కెరియ‌ర్ కొన‌సాగాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ మాట్లాడుతూ... మా ప్రొడ్యూస‌ర్ గురించి ఏం చెప్పాలో కూడా నాకు తెలియ‌డం లేదు. ఆయ‌న నాకు చాలా మంచి స్నేహితుడు. ఆయ‌న ప్ర‌తి పాట విష‌యంలో నాకు బాగా డిస్క‌స్ చేసి నా వెంటే ఉండేవారు. మంచి మాట‌లు క‌థ క‌థ‌నం అందించిన శ‌ర‌త్‌న‌ర్వాడే గారికి నా కృత‌జ్ఞ‌త‌లు. సాంగ్స్ అన్ని చాలా బాగా వ‌చ్చాయి. డిసెంబ‌ర్ 7న ఓట్ వేసి వ‌చ్చి మా సినిమాని చూడండి అని అన్నారు.

డైరెక్ట‌ర్ మాట్లాడుతూ... మా ఆహ్వానాన్ని మ‌న్నించి ఇక్క‌డ‌కు వ‌చ్చినందుకు పెద్ద‌లంద‌రికీ మా కృత‌జ్ఞ‌త‌లు. ఇది నేను నా జీవితంలో మ‌ర‌చిపోలేని రోజు. నా కోసం మా టెక్నీషియ‌న్స్ అంద‌రూ చాలా బాగా క‌ష్ట‌ప‌డ్డారు. అంద‌రూ సినిమాని ప్రేమించి చేశారు. డిసెంబ‌ర్ 7న మీ ముందుకు వ‌స్తుంది త‌ప్ప‌కుండా ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాను. యూత్‌కి, పేరెంట్స్ మ‌ధ్య ఉండే గ్యాప్ గురించి తీసుకుని చేశాను. పిల్ల‌లు పెళ్లి అనే విష‌యానికి వ‌చ్చేస‌రికి ఎందుకు ఇండివిడ్యూలిటీ కోరుకుంటున్నారు అన్న పాయింట్ మీద ఉంట‌ది. మా ప్రొడ్యూస‌ర్‌గారు ప్ర‌మోష‌న్స్ చాలా బాగా చేశారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఆలాంటి ప్రొడ్యూస‌ర్స్ దొర‌క‌డం నా అదృష్టం. మ‌ళ్ళీ స‌క్సెస్‌మీట్‌లో క‌లుద్దాం అని అన్నారు.

Difference Between Rx100 and Shubhalekha+Lu:

Shubhalekha+Lu Pre Release Event

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ