మన తెలుగు చిత్రసీమలో ఇప్పటివరకూ వచ్చిన బోల్డ్ మూవీస్ లో గుంటూరు టాకీస్ నెంబర్ ఒన్ పొజిషన్. ఈ సినిమాలో రష్మీ గ్లామర్ డోస్ కానీ శ్రద్ధాకపూర్ సెక్స్ అప్పీల్ కానీ పీక్స్ లో ఉండడమే కాదు సినిమా విజయంలో కీలకపాత్రలు పోషించాయి. ఆ బోల్డ్ ఫిలిమ్ ను తమిళంలో రీమేక్ చేశారు కూడా. అందరూ కొత్త వాళ్లతో తెరకెక్కించిన ఈ చిత్రం తమిళ వెర్షన్ శుక్రవారం విడుదలకానుంది. ఈ విషయం మన తెలుగు ప్రేక్షకులకు ఇంకా తెలియలేదనుకోండి. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్ మరియు సాంగ్ ప్రోమోస్ విడుదల చేశారు. తెలుగు వెర్షన్ లోనే రొమాన్స్ మరియు శృంగార సన్నివేశాల పతాక స్థాయిలో ఉన్నాయి అనుకుంటే.. తమిళంలో అంతకుమించి అన్నట్లుగా ఉన్నాయి.
శ్రద్ధాకపూర్ పాత్రను సన్నీలియోన్ బంధువు మియా రాయ్ లియోన్ పోషించగా.. రష్మీ క్యారెక్టర్ ను అస్నా జవేరి ప్లే చేసింది. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు సరిపోరన్నట్లు పూర్ణను కూడా యాడ్ చేశారు. మొత్తానికి గుంటూరు టాకీస్ మించిన స్థాయిలో ఉన్న ఈ చిత్రం తమిళనాట విజయం సాధిస్తుందా లేదా అనే విషయం పక్కన పెడితే, పోస్టర్స్ అండ్ ప్రోమోస్ మాత్రం నానా రాచ్చా చేస్తున్నాయి.
నిజానికి ప్రవీణ్ సత్తారు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలి అనుకున్నాడు. కానీ ఆ టైమ్ కి కుదరకపోవడంతో గరుడ వేగ తెరకెక్కించాడు. ఒకవేళ తమిళంలో సూపర్ హిట్ అయితే, హిందీలో తెరకెక్కించే సన్నాహాలు ఏమైనా చేస్తాడేమో చూడాలి. ఎంతైనా సెక్స్ ఎప్పుడైనా సేల్ అయ్యే ఐటెం కదండీ...