అగ్ర దర్శకులు, యువ దర్శకులు అన్న తేడా లేకుండా ఈమధ్యకాలంలో అందరు దర్శకులు ప్రేక్షకుల్ని మెప్పించడంలో ఎక్కడో ఒక చోట ఫెయిల్ అవుతున్నారు. కానీ.. అనిల్ రావిపూడి మాత్రం డైరెక్టర్ గా సక్సెస్ ఫుల్ గా హ్యాట్రిక్ హిట్ అందుకోవడమే కాక.. "ఎఫ్ 2"తో మరో హ్యాట్రిక్ కి నాంది పలకబోతున్నాడు. అయితే.. తన తాజా చిత్రం "ఎఫ్ 2" ఇంకా విడుదలవ్వకముందే అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రానికి రూట్ సెట్ చేసుకొన్నాడు. ఇటీవల అనిల్ రావుపూడి నేచురల్ స్టార్ నానికి ఒక కథ చెప్పగా.. సింగిల్ సిట్టింగ్ లోనే నాని ఆ కథను ఒకే చేశాడట.
"పటాస్"తో మొదలైన అనిల్ రావుపూడి విజయ విహారం "సుప్రీమ్, రాజా ది గ్రేట్" చిత్రాలతో కంటిన్యూ అయ్యింది. ఇక తాజా చిత్రం "ఎఫ్ 2" రిజల్ట్ మీద కూడా నిర్మాత దిల్ రాజు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. వెంకీ-వరుణ్ లు తోడల్లుళ్ళుగా కనిపించనున్న ఈ చిత్రం షూటింగ్ నిన్నటితో పూర్తయ్యింది. ఒక పాట మాత్రమే బ్యాలెన్స్ ఉన్న ఈ చిత్రాన్ని జనవరిలో విడుదల చేయనున్నారు.
ఇలా ఒక సినిమా షూటింగ్ పూర్తయ్యేలోపు మరో సినిమా ఒకే చేయడం అనేది ఈమధ్యకాలంలో అనిల్ రావిపూడికి మాత్రమే చెల్లింది. దర్శకుడిగా మనోడి ప్రతిభకు పేరు పెట్టాల్సిన పని లేదు కానీ.. కథనం మీద పెట్టే కాన్సన్ ట్రేషన్ లో సగమైనా కథ విషయంలో కూడా పెడితే కచ్చితంగా అగ్ర దర్శకుల జాబితాలో నిలవగలడు అనిల్ రావిపూడి.