మొన్నామధ్య నాని తన 24వ చిత్రాన్ని విక్రమ్ దర్శకత్వంలో ఉంటుంది అని ప్రకటిస్తూ... "అమ్మాయిలు ఇది మీకోసమే" అని చాలా పర్టీక్యులర్ గా చెప్పినప్పుడైనా అర్ధం చేసుకోవాల్సింది. ఏదో ప్యూర్ లవ్ స్టోరీ అనుకున్నారందరూ. కానీ.. నాని అలా ప్రత్యేకించి చెప్పడానికి కారణం ఉంది. ఆ కారణం ఏంట్రా అంటే.. ఈ చిత్రంలో నాని సరసన ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా అయిదుగురు హీరోయిన్లు నటించనున్నారు. ఇప్పటివరకూ నాని ఇద్దరు హీరోయిన్స్ తో నటించాడే తప్ప కనీసం మూడో హీరో అనే ఆలోచన కూడా రానివ్వలేదు. అలాంటిది విక్రమ్ కుమార్ సినిమాలో ఏకంగా అయిదుగురు ముద్దుగుమ్మలతో సరసలాడనున్నాడని తెలిసేసరికి నేచురల్ స్టార్ అభిమానులు కూడా షాక్ అయ్యారు. విక్రమ్ కుమార్ సినిమా కాబట్టి ఎలాగూ ఏ తరహా అసభ్యతకు తావు ఉండదనుకోండి.
ప్రస్తుతం విక్రమ్ కుమార్ మరియు మైత్రీ మూవీ మేకర్స్ ఆ అయిదుగురు హీరోయిన్లను వెతికే పనిలో పడ్డారు. అందరూ కొత్త అమ్మాయిలనే తీసుకుందామని విక్రమ్ కుమార్ చెప్పినప్పటికీ.. స్టార్ హీరోయిన్ ఒకరు, మీడియం రేంజ్ హీరోయిన్ ఒకర్ని తీసుకొని.. మిగతా ముగ్గురిని కొత్తవాళ్లను తీసుకోమని విక్రమ్ కుమార్ కు సలహా ఇచ్చారట మైత్రీ మిత్రులు.
వచ్చే ఏడాది సెట్స్ కు వెళ్లనున్న ఈ సినిమా కథ నిజానికి విక్రమ్ కుమార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కోసం రెడీ చేశాడని, ఆయన రిజెక్ట్ చేయడంతో నానితో మొదలెట్టాడని ఇన్సైడ్ సోర్సస్ ఇన్ఫో.