సినిమాల మీద పెద్దగా కాన్సన్ ట్రేట్ చేయకుండానే బుల్లితెరపై కనిపిస్తూనే సినిమాల్లోనూ భీభత్సమైన క్రేజ్ సంపాదించుకున్న యాంకర్ టర్నడ్ యాక్ట్రస్ అనసూయ మొన్నామధ్య "రంగస్థలం" చిత్రంలో రంగమ్మత్తగా నటించి నటిగానూ మంచి పేరు సంపాదించుకొంది. అయితే.. అంతకుముందు మాత్రం "సోగ్గాడే చిన్ని నాయన, విన్నర్" సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో మెరిసింది. ఆ తర్వాత కూడా ఆమెకు బోలెడన్ని ఐటెమ్ సాంగ్ ఆఫర్స్ వచ్చినప్పటికీ కాదనుకున్న అనసూయ.. లేటెస్ట్ గా ఓ ఐటెమ్ సాంగ్ కు అంగీకరించిందని తెలుస్తోంది.
వెంకటేష్, వరుణ్ తేజ్ కథానాయకులుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "ఎఫ్ 2" చిత్రంలో ఆల్రెడీ తమన్నా, మెహరీన్ లు కథానాయికలుగా నటిస్తుండగా.. ఓ స్పెషల్ సాంగ్ కోసం అనసూయను సంప్రదించారట. తొలుత ఐటెమ్ సాంగ్ అనగానే వెనక్కి తగ్గిన అనసూయ.. అది వెంకీ-వరుణ్ ల కాంబినేషన్ లో అని తెలిసేసరికి ఒప్పేసుకొందట.
ప్రస్తుతం అనసూయ ప్రధాన పాత్రలో "కథనం" అనే సినిమాతోపాటు మరో రెండు ప్రొజెక్ట్స్ పైప్ లైన్ లో ఉన్నాయి. టీవీ ప్రోగ్రామ్స్ లో యమ బిజీగా ఉంటున్న అనసూయ.. తన టీవీ షెడ్యూల్స్ కు ఎలాంటి ఇబ్బంది కలగకుండానే సినిమాలకు సమయాన్ని కేటాయిస్తుంది.