Advertisementt

విజయ్ దేవరకొండ బాలీవుడ్ క్యామియో

Wed 05th Dec 2018 02:05 PM
vijay devarakonda,bollywood  విజయ్ దేవరకొండ బాలీవుడ్ క్యామియో
Vijay Devarakonda Bollywood Entry Fixed విజయ్ దేవరకొండ బాలీవుడ్ క్యామియో
Advertisement
Ads by CJ

ప్రస్తుతం టాలీవుడ్ హీరోస్ లో బాలీవుడ్ కి వెళ్ళేందుకు మోస్ట్ ఎలిజిబుల్ హీరో ఎవర్రా అంటే అందరి నోటా ఇమ్మీడియట్ గా వినబడే మాట "విజయ్ దేవరకొండ". ఒక హిట్టు, వెంటనే ఒక ఫ్లాపు, మళ్ళీ వెంటనే హిట్టు అన్నట్లుగా సాగుతున్న ఈ కుర్రాడి కెరీర్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉంది. ముఖ్యంగా అందరూ ఫ్లాప్ అని డిసైడ్ అయిన "టాక్సీవాలా" విడుదలై సూపర్ హిట్ కొట్టినప్పట్నుంచి మనోడి రచ్చ మామూలుగా లేదు. అమ్మాయిలు, అబ్బాయిలు అన్న తేడా లేకుండా అందరూ నేనంటే నేను రౌడీ అని బాహాటంగా ప్రకటించుకుంటూ విజయ్ బాబు ఫ్యాన్ బేస్ ను తెగ పెంచేస్తున్నారు. 

ముఖ్యంగా.. ఇటీవల శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ "కాఫీ విత్ కరణ్" షోలో విజయ్ దేవరకొండను పొగడ్తలతో ముంచెత్తినప్పట్నుంచి విజయ్ సౌత్ లో మాత్రమే కాదు నార్త్ లో కూడా ఫేమస్ అయిపోయాడు. ప్రస్తుతం షాహిద్ కపూర్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న "కబీర్ సింగ్" కూడా "అర్జున్ రెడ్డి" రీమేక్ కావడంతో ప్రస్తుతం విజయ్ కి అక్కడ కూడా భారీ స్థాయి ఫాలోయింగ్ ఏర్పడింది. దాంతో బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు అని కామన్ క్వశ్చన్ తలెత్తింది.

విజయ్ కూడా మొదట్లో బాలీవుడ్ ఎంట్రీ విషయంలో కంగారుపడినా.. కొందరు పెద్దలు మరియు విజయ్ కి సన్నిహితులు ఇచ్చిన సలహా మేరకు.. తెలుగులో ఒక నాలుగైదు ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన తర్వాతే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడట. అయితే.. ఈలోపు మాత్రం ఒక క్యామియో ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకుకోసం ఆల్రెడీ రంగం సిద్ధమవుతోంది. ఓ భారీ బాలీవుడ్ చిత్రంలో విజయ్ గెస్ట్ రోల్ ప్లే చేయనున్నాడు. 2020లో ఆ చిత్రం విడుదలవ్వానుంది. సొ, ప్రస్తుతానికి విజయ్ బాలీవుడ్ ఎంట్రీ 2020కి ఫిక్స్ అయినట్లు అన్నమాట.

Vijay Devarakonda Bollywood Entry Fixed:

After the Continous Hits in Tollywood Vijay Devarakonda is all set to enter bollywood by 2020

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ