చాలామంది స్టార్ హీరోలు ఏదైనా తమ సినిమా ఆడియో వేడుక, సక్సెస్ మీట్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ జరిగినప్పుడు.... సమయానికి రాకుండా ఆ వేడుక చివర్లో వచ్చి స్టేజ్ మీదకెక్కి నాలుగు ముక్కలు చెప్పేసి వెళ్లిపోతుంటారు. అయితే అక్కడ సినిమాకి సంబందించిన ఇతరత్రా సభ్యులు ఉండి ఆ ఈవెంట్ ని మేనేజ్ చేస్తారు. కానీ కొంతమంది స్టార్స్ ప్రెస్ మీట్ కి, స్పెషల్ గా మీడియా ఇంటర్వూస్ కి కూడా బాగా లేట్ వస్తుంటారు. అలాగే స్టార్ హీరోయిన్ కాజల్ కూడా చేసింది. ప్రస్తుతం కవచం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది మీడియాతో బాగా ఇంటరాక్ట్ అవుతున్న కాజల్ నిన్నగాక మొన్న కవచం ఆడియో వేడుకలో పాల్గొంది. అలాగే కాజల్ అగర్వాల్ తాజాగా కవచం ఇంటర్వూస్ లో పాల్గొంటుంది.
తన సినిమా ఇంటర్వ్యూ లో ఎలెర్ట్ గా ఉండాల్సిన కాజల్ ఇప్పుడు మీడియా చేతిలో బుక్కైపోయింది. తాజాగా కాజల్ మీడియాని రెండు గంటలకు పైగా వెయిట్ చేయించింది. కవచం ప్రమోషన్స్ లో భాగంగా కాజల్ అగర్వాల్ మీడియా కి సోలో ఇంటర్వూస్ ఇస్తుంది. అయితే ప్రెస్ ని 10 గంటలకు కాజల్ ఇంటర్వ్యూ కోసం ప్రసాద్ ల్యాబ్ కి పిలిచాడు కవచం పీఆర్వో. అయితే మీడియా మాత్రం అనుకున్న టైం కి ప్రసాద్ ల్యాబ్ కి వచ్చేసింది. కానీ కాజల్ మాత్రం తాయితీగా.. 11.45 నిమిషాలకు వచ్చింది. ఇక రెండు గంటల పాటు కాజల్ కోసం వెయిట్ చేసిన మీడియా... కాజల్ కారు దిగి రాగానే బాయ్ కాట్ చెప్పేసి వెళ్లిపోయారు. ఇక మీడియా అలా బాయ్ కాట్ చెప్పగానే కాజల్ ఒకింత షాక్ అయ్యిందట. అయితే కాజల్ మళ్ళీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి క్షమాపణ చెబితేనే గాని లేదంటే కాజల్ కి మీడియా చుక్కలు చూపించడం ఖాయంగానే కనబడుతుంది.