తెలంగాణాలో ఒక పక్క ఎలక్షన్స్ మరోపక్క విడుదల సినిమాల హడావిడి. ప్రస్తుతం తెలంగాణాలో పొలిటికల్ హీట్ మాములుగా లేదు. రాజకీయపార్టీలన్నీ రోడ్డెక్కి ప్రచారం చేస్తున్నాయి. తెలంగాణాలో ప్రధాన రాజాకీయ పార్టీలన్నీ రేపు శుక్రవారం జరగబోయే ఎలక్షన్స్ ప్రచార హడావిడిలో ఉన్నాయి. ఇక వచ్చే శుక్రవారం ఎప్పటిలాగే నాలుగైదు సినిమాలు విడుదలకు క్యూ కట్టాయి. ఈ వారం విడుదలైన రజినీకాంత్ 2.ఓ సూపర్ హిట్ అయితే వాయిదా... వేద్దామనుకున్న సినిమాలు.. 2.ఓ కి యావరేజ్ టాక్ పడగానే భయం లేకుండా ఈ శుక్రవారం విడుదల సిద్దమయ్యాయి.
అయితే డిసెంబర్ 7 న తెలంగాణ ఎన్నికలు, పొలిటికల్ హీట్ ఏమో కానీ.. సెలబ్రిటీస్ మొత్తం తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి క్యూ కడతారు. ఇక తాజాగా అన్ని రాజకీయపార్టీలు హోరాహోరీగా ప్రచారంలో బిజీగా వున్నాయి. మరోపక్క రేపు శుక్రవారం విడుదల కాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్ - కాజల్ - మెహ్రీన్ ల కవచం సినిమా ఆడియో లాంచ్ ఆదివారం జరగగా.... సుమంత్ - ఈషా రెబ్బ ల సుబ్రమణ్యపురం నిన్న రాత్రి ఆడియో జరుపుకుంది. ఇక తమన్నా - సందీప్ కిషన్ ల నెక్స్ట్ నువ్వే ఈ రోజు అడియో వేడుకని జరుపుకోబోతుంది. మరో రెండు సినిమాలు హుషారు, శుభలేఖలు సినిమాల హడావిడే కనిపించడం లేదు.
మరి రాజకీయాలు, ఎలక్షన్స్ అంటూ రాజకీయనేతల హడావిడి వాళ్ళది.. ఇక్కడ సినిమాల విడుదల హడావిడి సినిమా వాళ్ళది అన్నట్టుగా వుంది వ్యవహారం. ఒక పక్క బహిరంగ సభలు.. మరోపక్క సినిమా ప్రెస్ మీట్స్ తో అన్నిటికన్నా ఎక్కువగా మీడియా హడావిడి పడుతుంది. మరి ఓటు ఓటే.. సినిమాలు సినిమాలే అన్నట్టుగా వుంది ఈ శుక్రవారం పరిస్థితి. చూద్దాం ఎలక్షన్స్ డే రోజున ధైర్యంగా బరిలోకి దిగుతున్న సినిమాల ఫైనల్ రిజెల్ట్ ఏమిటి అనేది.