Advertisementt

తెలుగులో దుల్క‌ర్‌కు మ‌రో ఛాన్స్‌!

Tue 04th Dec 2018 09:41 PM
dulquer,nani,dulquer salman,dil raju,indraganti mohanakrishna,mahanati,ok bangaram,mani ratnam,sri venkateswara creations  తెలుగులో దుల్క‌ర్‌కు మ‌రో ఛాన్స్‌!
dulquer and nani team up తెలుగులో దుల్క‌ర్‌కు మ‌రో ఛాన్స్‌!
Advertisement
Ads by CJ

ద‌క్షిణాది ప్రేక్ష‌క హృద‌యాల్లో క్రేజీ స్టార్ గా పేరుతెచ్చ‌కున్నాడు మ‌ల‌యాళ యంగ్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్‌. మ‌మ్ముట్టి త‌న‌యుడిగా తెరంగేట్రం చేసినా త‌న‌దైన మార్కు న‌ట‌తో అన‌తి కాలంలోనే న‌టుడిగా, హీరోగా మంచి పేరు తెచ్చ‌కున్నాడు. మ‌ణిర‌త్నం రూపొందించిన రొమాంటిక్ ల‌వ్‌స్టోరీ `ఓకే బంగారం` చిత్రంతో తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న దుల్క‌ర్ ఇటీవ‌ల సీనియ‌ర్ న‌టి సావిత్రి జీవిత క‌థ ఆధారంగా నాగ్ అశ్విన్ రూపొందించిన `మ‌హాన‌టి`తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువ‌య్యాడు. 

తెలుగులో ఈ రెండు చిత్రాల‌తో మంచి క్రేజ్‌ను సొంతం చేసుకున్న దుల్క‌ర్‌కు తెలుగులో తాజాగా మ‌రో అవ‌కాశం ద‌క్క‌బోతోంది. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు ఓ మ‌ల్టీస్టార‌ర్ చిత్రానికి శ్రీ‌కారం చుట్ట‌బోతున్న విష‌యం తెలిసిందే. స్క్రిప్ట్ పూర్త‌యి చాలా రోజులే అవుతున్నా దిల్ రాజు మిగ‌తా ప్రాజెక్టుల్లో బిజీగా వుండ‌టం వ‌ల్ల ఆల‌స్య‌మ‌వుతూ వ‌స్తోంది. ఇందులో నాని ఓ హీరోగా న‌టించ‌నుండ‌గా మ‌రో హీరో కోసం చాలా మందిని ప‌రిశీలించిన దిల్ రాజు `మ‌హాన‌టి`తో ఆక‌ట్టుకున్న దుల్క‌ర్ అయితేనే బాగుంటుంద‌ని భావించాడ‌ట‌. ఇటీవ‌లే దుల్క‌ర్‌ను దిల్ రాజుక‌లిసి క‌థ వినిపించాడ‌ని, నానితో క‌లిసి న‌టించ‌డానికి దుల్క‌ర్ అంగీక‌రించాడ‌ని తెలిసింది.  

dulquer and nani team up:

dulquer nani team up

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ