Advertisementt

అల్లు అర్జున్ హీరోయిన్‌కు ప్రిన్స్‌ కావాల‌ట‌!

Tue 04th Dec 2018 04:06 PM
adah sharma,adha,heart attack,s/o satyamurthy,charlie chaplin 2,cammando 3,bypass road,allu arjun,  అల్లు అర్జున్ హీరోయిన్‌కు ప్రిన్స్‌ కావాల‌ట‌!
allu arjun heroine wants prince అల్లు అర్జున్ హీరోయిన్‌కు ప్రిన్స్‌ కావాల‌ట‌!
Advertisement
Ads by CJ

ప్ర‌తీ అమ్మాయికి త‌ను కోరుకున్న క‌ల‌ల రాకుమారుడు కావాల‌ని వుంటుంది. అలాంటి ప్రిన్స్ కోస‌మే ఎదురుచూస్తున్నాను. రాజ‌కుమారుడి లాంటి వ్య‌క్తి తార‌స‌ప‌డితే కొంచెం వెతికి పెట్ట‌రూ అంటోంది ఆదాశ‌ర్మ‌. `హార్ట్ ఎటాక్‌`, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి వంటి చిత్రాల్లో మెరిసిన ఆదాశ‌ర్మ ఆ త‌రువాత బాలీవుడ్ చిత్రాల‌కే ప‌రిత‌మైపోయింది. చేతిలో సినిమాలు లేక‌పోయినా ట్విట్ట‌ర్‌లో య‌మ యాక్టీవ్‌గా వుండే ఈ బాంబే పోరీ సోమ‌వారం ప్రిన్సెస్ గౌనులో ముస్తాబై హోయ‌లు పోయింది. అంతేనా.. పెళ్లికి కావాల్సిన ప‌ర్‌ఫెక్ట్ గౌను దొరికింది. ఇక నాకు త‌గ్గ రాజ‌కుమారుడు దొర‌క‌డ‌మే ఆల‌స్యం. వెంట‌నే పెళ్లాడేస్తానంటూ త‌న‌ కోరిక‌ల చిట్టా విప్పింది. అందులో కొన్ని చిలిపి కోరిక‌లు వుండ‌టం గ‌మ‌నార్హం.

ఆదాకు కాబోయే వ‌రుడికి ఇలాంటి ల‌క్ష‌ణాలు వుండాల్సిందేన‌ట‌. త‌న‌కు కాబోయే వ‌రుడు జంతు ప్రేమికుడై వుండాలి. మంచి ప్ర‌వ‌ర్త‌న గ‌ల‌వాడైతే మ‌రీ మంచిద‌ట‌. మంచి మ‌న‌సున్న‌వాడైవుండాట‌. త‌న‌కు స‌హ‌క‌రించ‌నివారిని కూడా ప్రేమించ‌గ‌లిగే మ‌న‌సున్న‌వాడై వుండాలి. వెన‌క్కి ఎగిరే వ‌ర్క‌వుట్స్ ఎక్కువ‌గా చేయాలి. చివ‌ర‌గా ఇద్ద‌రం క‌లిసే పిజ్జా తినాలంటూ త‌న‌కు కాబోయే వ‌రుడి గురించి చిలిపి చిట్టా విప్ప‌డం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మ‌రి ఆదా కండీష‌న్‌ల‌కు అంగీక‌రించే ఆ రాజ‌కుమారుడు ఎక్క‌డున్నాడో? ఎప్నుడొస్తాడో ఆమెకే తెలియాలి. ఆదా శ‌ర్మ ప్ర‌స్తుతం హిందీలో `క‌మెండో-3`, `బైపాస్ రోడ్‌`, త‌మిళంలో ప్ర‌భుదేవాతో క‌లిసి `చార్లీచాప్లిన్‌-2`వంటి చిత్రాల్లో న‌టిస్తోంది. తెలుగులో మాత్రం ఆదాకు ఎలాంటి ఆఫ‌ర్‌లు లేవు. అయినా రామ్‌గోపాల్‌వ‌ర్మ త‌ర‌హాలోనే సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా నిత్యం వార్త‌ల్లో నిలుస్తోంది. 

allu arjun heroine wants prince:

adha sharma wants prince

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ