వ‌ర్మ ఎందుకు భ‌య‌ప‌డుతున్నాడు!

varma why postponed bhairava geetha

ఏ వివాద‌న్నైనా త‌న‌కు అనుకూలంగా మార్చుకోగ‌ల మాస్ట‌ర్ మైండ్ రామ్‌గోపాల్‌వ‌ర్మ‌. త‌న సినిమా వ‌స్తోందంటే ఎవ‌రైనా ప‌బ్లిసిటీ కోసం ల‌క్ష‌ల్లో డ‌బ్బులు ఖ‌ర్చుచేస్తుంటారు. కానీ వ‌ర్మ మాత్రం వివాదాల‌తో త‌న సినిమాకు కావాల్సినంత ప‌బ్లిసిటీని తెచ్చేసుకుంటాడు. అయితే తాజాగా త‌న కాంపౌండ్ నుంచి వ‌స్తున్న సినిమా విష‌యంలో మాత్రం వ‌ర్మ భ‌య‌ప‌డుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అభిశేక్ నామా, భాస్క‌ర్ రాశి నిర్మిస్తున్న `భైర‌వ‌గీత‌` చిత్రానికి రామ్‌గోపాల్‌వ‌ర్మ స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. వ‌రుస ఫ్లాపుల‌తో బెంబేలెత్తిపోయిన వ‌ర్మ ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి భ‌య‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. 

ఎలాంటి పోటీ లేని సంద‌ర్భంలో సోలోగా `భైర‌వ‌గీత‌` రిలీజ్ చేస్తేనే బాగుంటుంద‌ని వ‌ర్మ భావిస్తున్నాడ‌ట‌. మొద‌ట‌ ఈ చిత్రాన్ని అక్టొబ‌ర్ 12న రిలీజ్ చేస్తున్నాం అంటూ పోస్ట‌ర్స్ వ‌దిలారు. అదీ జ‌ర‌గ‌లేదు. ఆ త‌రువాత న‌వంబ‌ర్ 30న వ‌చ్చేస్తోందంటూ ప్ర‌చారం చేశారు. అయినా రాలేదు. `2.ఓ` వ‌స్తోంద‌న్న భ‌యంతో డిసెంబ‌ర్ 7కు మార్చారు. విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ‌ వ‌ర్మ మ‌ళ్లీ డేట్ మార్చేశాడు. చివ‌రికి ముందు అనుకున్న విడుద‌ల తేదీల‌న్నీ మార్చేసి వారం ఆల‌స్యంగా ఈ నెల 14న `భైర‌వ‌గీత‌`ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు. వ‌ర్మ కెరీర్‌లో ఇన్ని సార్లు విడుద‌ల తేదీలు మార్చిన సినిమా బ‌హుశా ఇదేనేమో. 

మాటి మాటికి విడుద‌ల తేదీని మారుస్తూ వ‌స్తున్న వ‌ర్మ ఈ 14న అయినా ఖ‌చ్చితంగా `భైర‌వ‌గీత‌`ను విడుద‌ల చేస్తాడా? లేక మ‌ళ్లీ వాయిదాస్తాడా? అనే సెటైర్లు వినిపిస్తున్నాయి. వ‌ర్మ భ‌య‌ప‌డుతున్నందు వ‌ల్లే సినిమా విడుద‌ల తేదీని మారుస్తూ వ‌స్తున్నాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు మొద‌ల‌య్యాయి. తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో రూపొందిన ఈ చిత్రం క‌న్న‌డంలో మాత్రం ఈ నెల 7నే విడుద‌ల‌వుతోంది. క‌న్న‌డ న‌టుడు ధ‌నుంజ‌య‌, హిందీ న‌టి ఇర్రా మోర్ జంట‌గా న‌టించిన ఈ సినిమాపై రామ్‌గోపాల్‌వ‌ర్మ భారీ అంచ‌నాలే పెట్టుకున్నాడు. వ‌ర్మ న‌మ్మ‌కాన్ని`భైర‌వ‌గీత‌` ఎంత వ‌ర‌కు నిజం చేస్తుందో చూడాలి. 

bhairava geetha once again postponed

ram gopal varma
bhairava geetha
varma
dhanunjaya
irra mor
siddhartha
rgv