Advertisementt

స్టైలిష్ యాక్ష‌న్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌ గా '118'!!

Tue 04th Dec 2018 11:11 AM
nandamuri kalyanram,118 movie,title logo  స్టైలిష్ యాక్ష‌న్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌ గా '118'!!
First Look: Nandamuri Kalyanram’s 118 స్టైలిష్ యాక్ష‌న్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌ గా '118'!!
Advertisement
Ads by CJ

ఒక ప‌క్క క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు.. మ‌రో ప‌క్క వైవిధ్య‌మున్న సినిమాల‌కు ప్రాధాన్య‌త ఇస్తూ హీరోగా త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నారు నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌. ఈ డైన‌మిక్ హీరో క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న స్టైలిష్ యాక్ష‌న్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ '118'. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కె.వి.గుహ‌న్ ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేశ్ కొనేరు నిర్మిస్తున్న ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌, టైటిల్‌ను విడుద‌ల చేశారు. చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. 

ఈ సంద‌ర్భంగా...

చిత్ర నిర్మాత మ‌హేశ్ కోనేరు మాట్లాడుతూ - నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌గారు ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి జోన‌ర్ మూవీ ఇది. స‌రికొత్త క్యారెక్ట‌ర్‌లో మెప్పించ‌నున్నారు. ఇదొక స్టైలిష్ యాక్ష‌న్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌. క‌థ‌, క‌థ‌నంతో పాటు యాక్ష‌న్ పార్ట్‌కు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వెంక‌ట్‌, అన్బ‌రివు, రియ‌ల్ స‌తీష్ అద్భుతమైన యాక్ష‌న్ పార్ట్‌ను అందించారు. నివేదా థామ‌స్‌, షాలిని పాండే హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. బ్యూటీఫుల్ విజువ‌ల్స్‌తో ప్రేక్ష‌కుల‌ను మెస్మరైజ్ చేసిన ప్ర‌ముఖ ఛాయాగ్రాహ‌కులు కె.వి.గుహ‌న్‌గారు ఈ చిత్రంతో డైరెక్ట‌ర్‌గా ప‌రిచయం అవుతున్నారు. ద‌ర్శ‌క‌త్వంతో పాటు ఆయ‌న క‌థ‌, క‌థ‌నం, సినిమాటోగ్ర‌ఫీ చేశారు. శేఖర్ చంద్ర సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి ద్వితీయార్థంలో విడుద‌ల చేయాల‌నుకుంటున్నాం అన్నారు. 

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, నివేదా థామ‌స్‌, షాలిని పాండే త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి మాట‌లు:  మిర్చి కిర‌ణ్‌,  పి.ఆర్ అండ్ మార్కెటింగ్‌: వ‌ంశీ కాక‌, ఆర్ట్‌:  కిర‌ణ్ కుమార్‌.ఎం, ఎడిట‌ర్‌:  త‌మ్మిరాజు, సంగీతం:  శేఖ‌ర్ చంద్ర‌, ఫైట్స్‌:  వెంక‌ట్‌, అన్బ‌రివు, రియ‌ల్ స‌తీశ్‌, వి.ఎఫ్.ఎక్స్‌: అద్వైత క్రియేటివ్ వ‌ర్క్స్‌, అనిల్ ప‌డూరి, నిర్మాత‌: మ‌హేశ్ కొనేరు, క‌థ‌, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్ర‌ఫీ, ద‌ర్శ‌క‌త్వం:  కె.వి.గుహ‌న్‌.

First Look: Nandamuri Kalyanram’s 118 :

Nandamuri Kalyanram's 118 Movie Title Logo

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ