Advertisementt

RRR కోసమేనా.. ఈ లుక్!!

Mon 03rd Dec 2018 11:05 PM
ntr,new look,rrr movie  RRR కోసమేనా.. ఈ లుక్!!
NTR New Look in RRR!! RRR కోసమేనా.. ఈ లుక్!!
Advertisement
Ads by CJ

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. నవంబర్ 19న ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈసినిమా కథ గురించి రోజుకొక రూమర్ వస్తున్నా... సినిమా బయటికి వచ్చేదాకా ఏది నమ్మలేం. ఇది ఇలా ఉండగా ఇందులో రామ్ చరణ్ చాలా రెగ్యులర్ లుక్ లో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడని వార్తలు వచ్చాయి.

అరవింద సమేత సినిమా కోసం స్లిమ్ గా ఫిట్ గా సిక్స్ ప్యాక్ చూపించిన తారక్ ఇప్పుడు RRR కోసం న్యూ లుక్... అంటే భారీకాయుడిగా మారిపోయాడు. మొన్నటివరకు సన్నగా ఉన్న తారక్ ఈసినిమా కోసం లావు పెరిగాడట. సిక్స్ ప్యాక్ కోసం లాయిడ్ స్టీవెన్స్ అనే సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ సహాయం తీసుకున్నాడు తారక్. ఇప్పుడు అదే ట్రైనర్ సహాయం తీసుకుని హల్క్ అవతారం లోకి మారాడట.

గుబురు గడ్డం వేసుకుని ఉన్న తారక్ ఫొటోస్ రీసెంట్ గా బయటికి వచ్చాయి. మరి ఈ లుక్ లోనే ఎన్టీఆర్ RRR లో కనిపిస్తాడమేమో. అంటే ఫైనల్ గా ఎన్టీఆర్ RRR లుక్ ఇదే అని మనం ఫిక్స్ అవ్వోచ్చేమో. ఇకపోతే చరణ్ - తారక్ ల మధ్య ఒక భారీ యాక్షన్ బ్లాకును తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. దాని కోసం ఒక స్పెషల్ సెట్ ను నిర్మించారు. తాజాగా రామ్ చరణ్ RRR ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నాడని సమాచారం.

NTR New Look in RRR!!:

RRR: NTR Look Final

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ