Advertisementt

భారీ బడ్జెట్ పెట్టినందుకు థాంక్స్

Mon 03rd Dec 2018 10:57 PM
kavacham movie,kavacham audio,kavacham songs  భారీ బడ్జెట్ పెట్టినందుకు థాంక్స్
Kavacham Audio Released!! భారీ బడ్జెట్ పెట్టినందుకు థాంక్స్
Advertisement
Ads by CJ

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం కవచం .. నూతన దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 7 న విడుదల అవుతుంది..  మెహ్రీన్ పిర్జాదా, బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేష్, హర్షవర్ధన్ రానే ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. . వంశధార క్రియేషన్స్ బ్యానర్ పై నవీన్ సొంటినేని (నాని) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు..   తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.. కాగా ఈ చిత్రం యొక్క ఆడియో వేడుక భీమవరంలో ప్రేక్షకుల సమక్షంలో ఘనంగా జరిగింది.. 

ఈ సందర్భంగా చోటా కె నాయుడు మాట్లాడుతూ..  భీమవరంలో ఆడియో ఫంక్షన్ అనగానే బెల్లంకొండ సురేష్ గారికి థాంక్స్ చెప్పాను.. ఈ సినిమా డైరెక్టర్ తో నా కెరీర్ మొదలైంది..అయన కో డైరెక్టర్ గా ఉన్నప్పటినుంచి ఆయనతో వర్క్ చేస్తున్నాను.. పవన్ కళ్యాణ్ గారి ఫెవరెట్ కో డైరెక్టర్ శ్రీనివాస్ మామిళ్ళ.. అయన చాల పర్ఫెక్ట్ గా సినిమా తీశారు.. మీ అందరికి నచ్చుతుంది.. థమన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..అయన 100 సినిమాలు చేసారు.. కాజల్ వర్క్ డెడికేషన్ చాల గొప్పది.. ఆమె ఈ రేంజ్ లో ఉందంటే ఆమె వర్క్ కారణం..హీరో సాయి గురించి చెప్పాలంటే ఎన్టీఆర్ తర్వాత హీరో సాయి నే చూసాను.. సింగల్ టేక్ ఆర్టిస్ట్.. బెస్ట్ హీరో.. అయన టాప్ హీరో అవుతారని ఆశిస్తున్నాను.. కవచం తర్వాత సాయి డెఫినెట్ గా  మంచి హీరో అవుతారు అన్నారు..

నిర్మాత నవీన్ సొంటినేని మాట్లాడుతూ.. ఈ ఫంక్షన్ ని విజయవంతం చేయడానికి వచ్చిన ప్రేక్షకులకు చాల థాంక్స్.. నేను ప్రొడక్షన్ లోకి వస్తున్నా అనగానే నాకు సపోర్ట్ చేసిన నా ఫామిలీ కి ధన్యవాదాలు..  సినిమా కి అందరు బాగా పనిచేసారు.. సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు..

మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.థమన్ మాట్లాడుతూ. నాకు ఎనర్జీ హీరోలంటే చాల ఇష్టం.. సాయి కూడా నా ఎనర్జీ హీరోల లిస్టులో ఉన్నాడు.. సాయి తో పనిచేయాలని చాల రోజులనుండి ఉంది.. ఇప్పుడు అవకాశం వచ్చింది.. ఈ సినిమా కి పనిచేస్తున్నందుకు చాల హ్యాపీ గా ఉంది.. బెల్లంకొండ సురేష్ గారితో ఆరు సినిమా లు చేశాను.. అన్ని హిట్.. ఈ సినిమా వాటికన్నా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను.. ప్రొడ్యూసర్ గారు చిన్నవయసులో మంచి సినిమా చేసారు.. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు..

దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ మాట్లాడుతూ.. ఈ ఫంక్షన్ కి వచ్చిన అందరికి ధన్యవాదాలు.. ఈ అవకాశం ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారికి, బెల్లంకొండ సురేష్ గారికి, ప్రొడ్యూసర్ నవీన్ గారికి చాల థాంక్స్.. ఈ సినిమా కి హీరో సాయి శ్రీనివాస్ గారు ఇచ్చిన కో ఆపరేషన్ చాల గొప్పది.. కాజల్ గారు చాల బాగా నటించారు.. థమన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు.. మా టీం అందరు చాల కష్టపడి పనిచేసారు.. అందరికి థాంక్స్.. 

హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం.. ఈ ఫంక్షన్ కి వచ్చినందుకు చాల థాంక్స్.. నేను ఈ పోసిషన్ లో ఉన్నానంటే మీ అందరు సపోర్ట్ కారణం.. ఈ సినిమా కి పనిచేయడం చాల ఆనందంగా ఉంది.. డిసెంబర్ 7 న ఈ సినిమా ని చూసి విజయం అందిస్తారని కోరుకుంటున్నాను.. అన్నారు.. 

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ..  ఈ ఫంక్షన్ కి వచ్చిన భీమవరం ప్రజలకు చాల థాంక్స్.. నాతో ఇంత మంచి సినిమా చేసిన డైరెక్టర్ శ్రీనివాస్ గారికి చాల థాంక్స్.. ఇంత మంచి కథను నెక్స్ట్ లెవెల్ లోకి తీసుకెళ్లిన చోటాగారికి, మిగితా టెక్నిషియన్స్ కి చాల థాంక్స్.. ఈ సినిమా అవుట్ ఫుట్ ఇంత బాగా రావడానికి కారణమైన ప్రొడ్యూసర్ నవీన్ గారికి  చాల చాల థాంక్స్.. నన్ను నమ్మి ఇంత బడ్జెట్ తో సినిమా చేసిన మీతో ఎన్ని సినిమాలైనా చేస్తాను.. ఈ నమ్మకం నేను మర్చిపోను.. మీడియా వారికీ చాల థాంక్స్.. డిసెంబర్ 7 న సినిమా రాబోతుంది అందరు ఈ సినిమా చూసి విజయవంతం చేయాలనీ కోరుకుంటున్నాను.. మీ ప్రేమ నమ్మకం కోసం ఇంకా ఇంకా  కష్టపడతానని అన్నారు..

Kavacham Audio Released!!:

Bellamkonda Srinivas Kavacham Audio Songs Launch

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ