Advertisementt

రాజమౌళి ట్వీట్ కోసం వెయిటింగ్ ఇక్కడ!!

Mon 03rd Dec 2018 01:40 PM
  రాజమౌళి ట్వీట్ కోసం వెయిటింగ్ ఇక్కడ!!
Waiting for Rajamouli Tweet on 2.O Movie రాజమౌళి ట్వీట్ కోసం వెయిటింగ్ ఇక్కడ!!
Advertisement
Ads by CJ

2.O రిలీజ్‌ టైములో రాజమౌళి - శంకర్ ఒక్కొక్కరు నేను మీ ఫ్యాన్... నేను మీ ఫ్యాన్ అని తెగ హడావిడి చేశారు. సౌత్ ఇండియా లో టాప్ డైరెక్టర్స్ అనగానే మొదటి వీరి పేర్లే వినబడతాయి. అలాంటిది వీరి సినిమాలు వస్తున్నాయి అంటే తమ ఫ్యాన్సే కాదు సెలెబ్రెటీస్ కూడా వెయిట్ చేసి మరీ... ఎంత బిజీగా ఉన్నా సినిమాను చూస్తారు. 2.O సినిమా విడుదలకి ముందు రోజు చాలా ఎగ్జైటెడ్ గా వున్నానని చెప్పిన రాజమౌళి సినిమా విడుదలై మూడు రోజులు అవుతున్నా ఇంకా తన ఒపీనియన్ ని చెప్పలేదు.

ఎంత బిజీగా ఉన్నప్పటికీ...  సినిమాలు చూసి మరీ వాటి గురించి ట్వీట్ వేసే రాజమౌళి ఇంకా ఈసినిమా చూడకపోవటం ఏంటని ఆశర్యపోతున్నారు. ప్రస్తుతం రాజమౌళి RRR షూటింగ్ లో బిజీగా ఉండటంతో ఈసినిమా చూడలేకపోయాడని తెలుస్తుంది. ఇద్దరు స్టార్ హీరోస్ నటిస్తున్న చిత్రం కాబట్టి ఎక్కడా తేడా రాకుండా... కాల్షీట్స్ ని కేర్‌ఫుల్‌గా వాడుకుంటున్నాడు. ఈరోజు ఆదివారం కాబట్టి షూటింగ్ కి సెలవు ఉంటది కాబట్టి ఈరోజు జక్కన్న 2.O చూసే అవకాశముంది.

రాజమౌళి గనక సినిమా చూస్తే కచ్చితంగా తన అభిప్రాయంని చెబుతాడు. బాహుబలి చూసిన శంకర్ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో చెప్పాడు.  అలానే రాజమౌళి కూడా 2.O ని చూసి ఏం చెప్తాడా అని తమిళ సినీ ప్రియులు, శంకర్‌ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Waiting for Rajamouli Tweet on 2.O Movie:

What about Rajamouli Response on 2.O

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ