Advertisementt

ప్రమోషన్స్ తో పోటీ పడుతున్నారు!!

Mon 03rd Dec 2018 11:44 AM
ntr biopic,kathanayakudu vinaya vidheya rama  ప్రమోషన్స్ తో పోటీ పడుతున్నారు!!
Charan and Balayya are competing with promotions !! ప్రమోషన్స్ తో పోటీ పడుతున్నారు!!
Advertisement
Ads by CJ

సినిమాలకు సంక్రాతి హడావిడి మొదలైపోయింది. 2019 సంక్రాతి బరిలో దిగబోతున్న సినిమాల హడావిడి ఎప్పటినుండో మొదలైంది. డిసెంబర్ 21 న విడుదలకాబోతున్న సినిమాలకు ధీటుగా సంక్రాతి సినిమాల ప్రమోషన్స్ మొదలైపోయాయి. వచ్చే సంక్రాతి బరిలో.. రామ్ చరణ్ వినయ విధేయరామ తో దిగుతుంటే... బాలకృష్ణ మాత్రం ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు తో బరిలోకి దిగుతున్నాడు. మెగా నందమూరి వార్ డిసైడ్ అవడం... అప్పుడే అభిమానులు మా సినిమా హిట్ ఆవుతుంది అంటే మా సినిమా హిట్ అవుతుంది అంటున్నారు.

కేవలం అభిమానులేనా.. దర్శకుడు బోయపాటి, క్రిష్ లు కూడా నువ్వా - నేనా అంటూ తమ సినిమాల ప్రమోషన్స్ జోరు చూపిస్తున్నారు. దర్శకుడు క్రిష్ తో కలిసి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ ని పరిగెత్తించడమే కాదు.. కథానాయకుడు లుక్స్ ని ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ.. తాజాగా మహానాయకుడు లుక్స్ ని స్టార్ట్ కూడా చేసేసాడు. బాలయ్య, క్రిష్ లతో పోటీగా కాకపోయినా... కాస్త లెట్ గా తమ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన రామ్ చరణ్ - బోయపాటిలు అపుడే వినయ విధేయరామ టీజర్ ని కూడా వదిలారు. మరి లుక్స్ తో టీజర్ తోనూ హడావిడి చేస్తున్న వినయ విధేయరామ కి ఏమాత్రం తగ్గకుండా బాలయ్య - క్రిష్ లు సింగిల్స్ తో హడావిడి మొదలు పెట్టేసారు.

ఇక బోయపాటి కూడా రామ్ చరణ్ తో కలిసి వినయ విధేయరామ ప్రమోషన్స్ తో పిచ్చెక్కించేస్తున్నారు. మరి మాస్ లుక్, క్లాస్ లుక్ తో అదరగొట్టిన చరణ్... తాజాగా అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్న లుక్ తోనూ అదరగొట్టేసాడు. ఇక మహానాయకుడిలో బాలయ్య ఎన్టీఆర్ పొలిటికల్ లుక్ తో ఇరగదీస్తున్నాడు. తాజాగా బయోపిక్‌లోని ఫస్ట్‌ పాటని ఈరోజు విడుదల చేశారు. ఆ ఫస్ట్ సింగిల్ ఇప్పటికే మార్కెట్ లో హోరెత్తిపోతుంది. ఇక రేపు సోమవారం వినయ విధేయ రామ ఫస్ట్‌ సాంగ్‌ రిలీజ్‌చెయ్యబోతున్నారు. మరి భారీ హైప్ ఉన్న ఈ రెండు చిత్రాలు ప్రమోషన్స్ తో అదరగొడుతున్నారు. ఇక ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ సింగల్ అదరగొట్టేస్తుంటే... వినయ విధేయరామ ఫస్ట్ సింగిల్ ఎలా వుండబోతుందో అనే ఆసక్తి ఇప్పుడు అందరిలో మొదలైంది.

Charan and Balayya are competing with promotions !!:

Ntr Biopic Kathanayakudu first single vs Vinaya Vidheya Rama first single

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ