సై రా నరసింహారెడ్డి తర్వాత మెగా స్టార్ చిరంజీవితో కొరటాల నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుందని.. రామ్ చరణ్ తో చెయ్యాల్సిన కొరటాలకు చిరు తో సినిమా చేసే అవకాశం దక్కింది . ఎక్కడా అధికారిక ప్రకటన రాలేదుకాని.. చిరంజీవి సై రా నరసింహారెడ్డి సినిమా తరవాత కొరటాల శివ సినిమానే చిరు చేస్తున్నాడన్నారు. అసలైతే కొరటాల - చిరు మూవీ ఈ నెలలోనే సెట్స్ మీదకెళ్లాల్సి ఉండగా... చిరు బిజీ వలన, కొరటాల కథను పూర్తిగా సిద్ధం చేయకపోవడంతో.. ఈ క్రేజీ కాంబో 2019 సంక్రాంతి తర్వాత పట్టాలెక్కే ఛాన్స్ ఉన్నట్లుగా చెప్పారు. ఈలోపు సై రా సినిమా షూటింగ్ ని చిరు ఒక కొలిక్కి తెచ్చేస్తాడని... ఎలాగూ సై రా సమ్మర్ రిలీజ్ కాబట్టి కొరటాల మూవీ కి చిరంజీవి ఫిబ్రవరి నుండే సిద్దమవుతాడన్నారు.
అయితే నిన్న సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో సై రా సినిమా ని సురేందర్ రెడ్డి మాటిమాటికి రీ షూట్స్ చెయ్యడంతో.. వచ్చే వేసవికి విడుదలవ్వాల్సిన సై రా నరసింహారెడ్డి సినిమా 2020 సంక్రాంతికి షిఫ్ట్ అయినట్లుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే చిరు - సురేందర్ రెడ్డి లు సై రా లో కొన్ని సీన్స్ కి సంతృప్తి చెందక రీ షూట్స్ చెయ్యడంతో... సై రా వేసవి నుండి సంక్రాంతికి షిఫ్ట్ అయ్యిందని అంటున్నారు. మారా న్యూస్ ప్రచారంలో ఉండగానే... చిరు తో సినిమా కోసం వెయిట్ చేస్తున్న కొరటాల శివ కి చిరు హ్యాండ్ ఇచ్చాడంటూ ఫిలింనగర్ లో టాక్ నడుస్తుంది. సై రా రీ షూట్స్ తో కొరటాల సినిమాకి చిరు డేట్స్ అడ్జెస్ట్ చెయ్యలేకపోతున్నాడని.. అందుకే కొరటాల శివ ఏం చెయ్యాలో తెలియక మరో హీరో ని చూసుకుంటున్నాడని అంటున్నారు.