దాదాపు దశాబ్దం పాటు సినిమాలకి దూరంగా ఉన్న మెగా స్టార్ చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' తో రీఎంట్రీ ఇచ్చి తన అభిమానుల్లో మునుపటి ఉత్తేజాన్ని నింపారు. ఆ తరువాత కాస్త గ్యాప్ తో 'సైరా' ను స్టార్ట్ చేశాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈసినిమా పై అంచనాలు పెంచుకున్నారు మెగా అభిమానులు. మొదట ఈసినిమాను వచ్చే ఏడాది 2019 సమ్మర్ లో రిలీజ్ అనుకున్నారు. కానీ అప్పుడు ఈసినిమా సమ్మర్ లో వచ్చే సూచనలు కనిపించడం లేదు. 2019 దసరాకు వచ్చే అవకాశముందని అన్నారు.
అయితే నిర్మాత రామ్ చరణ్ మాత్రం బడ్జెట్ ను పెంచుకుంటూ పోతున్నాడని... ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తీయాలని...రిలీజ్ డేట్ విషయం పటించుకోకుండా పని చేయాలనీ డైరెక్టర్ కి చెప్పాడట. దాంతో ఈసినిమాకు డెడ్ లైన్ ఏమి పెట్టకుండా కావాల్సినంత సమయం తీసుకొమ్మని దర్శకుడు సురేందర్ రెడ్డికి చెప్పినట్టు తెలుస్తుంది. అందుకే ఈసినిమా 2019 దసరాకి కూడా కాకుండా 2020 సంక్రాంతి వచ్చే అవకాశం ఉందని సమాచారం.
మరోపక్క రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో RRR లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈసినిమా కూడా అదే ఏడాది అంటే 2020 సమ్మర్ లో వస్తుందని ముందుగానే అనౌన్స్ చేసారు. సో 2019 లో మెగా ఫ్యాన్స్ కు రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ' తప్ప ఇంకో సినిమా లేదన్న మాట.. మరింత నిరాశకు గురి చేస్తోంది. మరో మెగా స్టార్ హీరో అల్లు అర్జున్ ఇంకా తన నెక్స్ట్ సినిమాను కంఫర్మ్ చేయలేదు.