హీరోలుగా సక్సెస్ లు, అవకాశాలు లేని నిన్నటితరం కథానాయకులందరూ ప్రస్తుతం విలన్లుగా మారే క్రమంలో బిజీగా ఉన్నట్లున్నారు. ఇదివరకు కూడా ఈ ఫార్మాట్ ను చాలా మంది హీరోలు ఫాలో అయినప్పటికీ.. ఫ్యామిలీ స్టార్ జగపతిబాబు ఒక్కసారిగా లెజండ్ సినిమాలో విలన్ గా తన నటవిశ్వరూపం చూపించి.. టాప్ విలన్ గా పేరు తెచ్చుకున్నప్పట్నుంచి విలన్ రోల్స్ కి డిమాండ్ పెరిగింది. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని చాలామంది ఫామ్ లో లేని హీరోలు నెగిటివ్ రోల్స్ ప్లే చేయడానికి ముందుకొచ్చారు. అందరూ జగపతిబాబు రేంజ్ లో సక్సెస్ అవ్వలేకపోయినా మిగతా ఎక్స్ హీరోలకు మాత్రం స్ఫూర్తిగా నిలిచారు.
ఇలా స్పూర్తి పొంది ఇప్పుడు విలన్ అవతారం ఎత్తేందుకు సన్నద్ధమవుతున్నాడు. తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీలో లవర్ బోయ్ ఇమేజ్ సొంతం చేసుకొని కొన్నాళ్లపాటు వరుస విజయాలతో అమ్మాయిల గుండెల్లో డబుల్ కాట్ బెడ్ వేసుకొని మరీ పడుకొన్న సిద్ధార్డ్ అనంతర కాలంలో తన స్టార్ డమ్ ను స్టాండర్డ్ గా నిలబెట్టుకోలేకపోయాడు. ఆ కారణంగా సపోర్టింగ్ రోల్స్ చేసే స్థాయికి దిగిపోయాడు. అయినా కూడా ఎవరూ ఆఫర్లు ఇవ్వకపోవడంతో సొంతంగా సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నాడు. ఇప్పుడు సిద్ధార్ధ్ కి ఒక బంపర్ ఆఫర్ వచ్చింది.. నాని హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో నెగిటివ్ రోల్ ప్లే చేసే ఛాన్స్ సిధ్దార్త్ ను వెతుక్కుంటూ వెళ్లింది. ఆలస్యం చేయకుండా వెంటనే అందుకు అంగీకరించాడట సిద్ధార్థ్. మరి విలన్ గా సిద్ధార్ధ్ ప్రేక్షకుల్ని ఏమేరకు అలరిస్తాడో చూడాలి.