Advertisementt

పాపం టాక్సీవాలా హీరోయిన్ అలా దొరికిపోయింది

Sat 01st Dec 2018 06:21 PM
taxiwala,priyanka jawalkar,viral photo  పాపం టాక్సీవాలా హీరోయిన్ అలా దొరికిపోయింది
Troll Pages Trolling Priyanka Jawalkar for that Reason పాపం టాక్సీవాలా హీరోయిన్ అలా దొరికిపోయింది
Advertisement
Ads by CJ

హీరో హీరోయిన్ అనే కాదు ఇండస్ట్రీలో ఉంటున్న లేదా రావాలనుకొంటున్న ప్రతి ఒక్కరూ కోరుకొనేది పబ్లిసిటీ. అయితే.. ఈ పబ్లిసిటీ పాజిటివ్ గా వస్తే పర్లేదు కానీ.. నెగిటివ్ గా వస్తే మాత్రం అస్సలు తట్టుకోలేరు. ఇప్పుడు ఈ సెకండ్ సిచ్యుయేషన్ కారణంగా చాలా ఇబ్బందులు పడుతోంది "టాక్సీవాలా" చిత్రంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయిన ప్రియాంక జవాల్కర్. అసలు విడుదలవుతుందో లేదోనని భయపడిన టాక్సీవాలా, ఘనంగా విడుదలవ్వడమే కాక సూపర్ హిట్ గా నిలవడంతో ఆమె అస్సలు ఎక్స్ పెక్ట్ చేయని క్రేజ్ సొంతమైంది. ఆ క్రేజ్ ను, స్టార్ డమ్ ను ఇంకా పూర్తిగా ఎంజాయ్ చేయకుండానే నెటిజన్లకు దారుణంగా దొరికిపోయింది అమ్మడు. 

ఇంతకీ మేటర్ ఏంటంటే.. మన హీరోహీరోయిన్లు ఇప్పుడంటే చూడ్డానికి అద్భుతంగా ఉంటారు కానీ.. వాళ్ళ పాత ఫోటోస్ చూస్తే మాత్రం.. ఏంటి ఈ అమ్మాయి ఇలా ఉండేదా? అని షాక్ అవ్వడమే కాక షేక్ అయిపోతారు కూడా. ఇప్పుడు ప్రియాంక జవాల్కర్ కి చెందిన పాత ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పుడో ఏదో కాలేజ్ అడ్మిషన్ కోసం తీయించుకొన్న పాస్ పోర్ట్ సైజ్ ఫోటో అది. ఆ ఫోటో ఎలా, ఎవరి వల్ల బయటకి వచ్చిందో తెలియదు కానీ.. ప్రస్తుతం అన్నీ ట్రోల్ పేజస్ లో ఆ ఫోటో దర్శనమిస్తోంది. ఈ విషయం ప్రియాంక జవాల్కర్ దాకా వెళ్లింది. అయితే.. అమ్మడు మాత్రం చాలా పాజిటివ్ గా తీసుకొని.. "కొన్ని రోజులు నేను మీకు ఎంటర్టైన్మెంట్ ని" ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. అప్పట్లో బొద్దుగా ఉన్న అమ్మడు ఇప్పుడు మాత్రం సూపర్ సెక్సీగా ఉంది. టాక్సీవాలాతో మంచి విజయంతోపాటు పేరు కూడా సంపాదించుకున్న ఈ అనంతపూర్ అమ్మాయి ప్రస్తుతం కొత్త ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తోంది.  

Troll Pages Trolling Priyanka Jawalkar for that Reason:

An Old ppic of Taxiwaala fame priyanka jawalkar had gone viral for some unexpected reasons and she is happy with that and said thanks for the trolls.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ