అసలు రాజమౌళి మనసులో ఏం ఉందో... ఆయన ఏం అనుకుంటున్నాడో తెలియదు కానీ, సినిమాలో పలానా వాళ్ళు ఉన్నారని, స్టోరీ ఇది అని, హీరోల పాత్రలు ఇలా ఉంటాయి అని... RRRపై రోజుకొక న్యూస్ బయటికి వచ్చి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈనేపధ్యంలో ఇంకో కొత్త రూమర్ బయటికి వచ్చింది. కొన్నేళ్ల వరకు పలు భాషల్లో హీరోయిన్‌గా నటించిన ప్రియమణికి కొన్ని ఫ్లాప్స్ రావడంతో తెలుగు పరిశ్రమకు దూరమైన సంగతి తెలిసిందే.
తెలుగులో సక్సెస్ లేదని ఇతర భాషల్లో ట్రై చేసింది. కానీ అక్కడ కూడా బెడిసి కొట్టడంతో సినిమాలు మానేసి పెళ్ళి చేసుకొని హాయిగా టీవీ షోస్ చేస్తూ కాలాన్ని గడిపేస్తుంది. అయితే మళ్లీ ఇన్నేళ్ల తరువాత RRRతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తోందట. మరి ఈమె పాత్ర ఎలా ఉంటుందో ఇంకా తెలియలేదు. గతంలో రాజమౌళి - ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘యమదొంగ’ చిత్రంలో ప్రియమణి హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.
రాజమౌళి త్వరగా ఏ విషయం బయటికి చెప్పడు. ఏ పని అయినా సైలెంట్ గా కానిచ్చేసి... తర్వాత చెబుతాడు. ప్రియమణి విషయంలో కూడా అంతే చేయనున్నాడా జక్కన్న. ఏమో తెలియదు కానీ... RRRలో ప్రియమణి ఒక కీలక పాత్రలో నటిస్తుందంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో దర్శకుడు రాజమౌళి రామ్ చరణ్ - ఎన్టీఆర్‌లపై ఓ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నాడు.