ఈటీవీలో ప్రతి గురువారం, శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారమవుతున్న కామెడీ ప్రోగ్రాం జబర్దస్త్ ని తలదేన్నేలా మిగతా ఛానల్స్ ఎన్ని ప్రోగ్రామ్స్ ని ప్లాన్ చేసినా జబర్దస్త్ ని ఢీ కొట్టలేకపోయాయి. గత కొన్నేళ్లుగా ఈటీవి లో ఈ జబర్దస్త్ ప్రోగ్రాం కి విపరీతమైన ఆదరణ వచ్చింది కూడా. ప్రేక్షకులు కూడా జబర్దస్త్ అంటే పడి చచ్చిపోతారు. వారంలో రెండు రోజులు రాత్రిపూట భోజనాలు చేసి ప్రశాంతంగా చూసే ఈ ప్రోగ్రాం వలన అనేకమంది కమెడియన్స్ పుట్టుకొచ్చారు. ఆ జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా చాలామంది కమెడియన్స్ సినిమాల్లోనూ, బుల్లితెర మీద కూడా బిజీ అయ్యారు. సుధీర్, చంటి ఇలా చాలామంది జబర్దస్త్ నుండి బుల్లితెర మీద రాజ్యమేలుతున్నారు. ఇక అనసూయ, రష్మీ లాంటి యాంకర్స్ కి జబర్దస్త్ చేసిన మేలు అంతా ఇంతా కాదు. ఏదో ఒక ఆడియోనో లేదంటే ఏ సినిమా ఈవెంట్ కో యాంకరింగ్ చేసుకునే వీరు జబర్దస్త్ ప్రోగ్రాంతో ఎంతగా పాపులర్ అయ్యారో తెలిసిందే.
అయితే గురువారం రోజు అనసూయ యాంకరింగ్‌తో ప్రసారమయ్యే జబర్దస్త్ లో హైపర్ ఆది స్కిట్ కి వీరాభిమానులున్నారు. హైపర్ ఆది వేసే పంచ్ లతో జడ్జెస్ నాగబాబు, రోజా మాత్రమేకాదు... చాలామంది పడి పడి నవ్వుకుంటారు. హైపర్ ఆది సందర్భానుసారంగా వేసే పంచ్‌లు గురువారం జబర్దస్త్ కి బలంగా ఉండేవి. అలాంటి హైపర్ ఆది కొన్నాళ్లుగా జబర్దస్త్ కి దూరమయ్యాడు. కారణాలు తెలియవు గాని.. హైపర్ ఆది సినిమా కథలు రాస్తాడు. మరి వెండితెర మీద బిజీ అవడం మూలంగా హైపర్ ఆది జబర్దస్త్ కి మానేశాడో తెలియదు కానీ.. హైపర్ ఆదిలేకుండా జబర్దస్త్ వేస్ట్ అన్నట్లుగా మాట్లాడుతున్నారు బయట జనాలు. మరి నిజంగానే హైపర్ ఆది లేకపోతే జబర్దస్త్ ఎవరు చూడరా? ఎందుకు చూడరూ? గత రెండు వారాలుగా నాగబాబు, రోజాలు సుధీర్ టీం చేసిన మిరపకాయ స్కిట్ నే ఫాలో అవుతున్నారు. సుడిగాలి సుధీర్, శ్రీను, ఆటో రామ్ ప్రసాద్, సన్నీలు పచ్చిమిర్చి తింటూ చేసిన స్కిట్ నవ్వులు పూయించింది. అలాగే గత వారం కూడా అవినాష్ టీం కి ఈ మిర్చి స్కిట్ ఇచ్చారు నాగబాబు వాళ్ళు. ఇక తాజాగా నరేష్ వాళ్ళు భాస్కర్ వాళ్ళు చేసిన మిర్చి స్కిట్ కి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మరి హైపర్ ఆది లేకపోయినా జబర్దస్త్ నవ్వుల కామెడీకి కొదవే లేదు.