మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న చిత్రం ‘సైరా’. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా యొక్క టీజర్‌కు రీసెంట్ గా మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. దాంతో ఈసినిమాపై అంచనాలు భారీగా ఏర్పడాయి. దీనికి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. స్వాతంత్ర్య సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.
ఈనేపధ్యంలో ఈసినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు రామ్ చరణ్. దీనికనుగుణంగా పనులు కూడా చకచక చేస్తునట్టు టాక్. ఇది ఇలా ఉండగా యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో.. ‘బాహుబలి’ తరువాత ప్రభాస్ చేస్తున్న చిత్రం ‘సాహో’ యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది.
ఈ సినిమాని కూడా అదే రోజు అంటే ఆగస్టు 15వ తేదీన విడుదల చేయాలని భావిస్తున్నారట. ఇదే కనుక నిజం అయితే బాక్సాఫీస్ వద్ద పోటీ మాములుగా ఉండదు. ‘బాహుబలి’ సిరీస్ తో ప్రభాస్ తన మార్కెట్ ను ఇండియా వైడ్ ఓపెన్ చేసాడు. సాహో హిందీ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. దీనిపై అంచనాలు అయితే ఒక రేంజ్ లో ఉన్నాయి. చిరంజీవి ఖైదీ నెంబర్ 150 తో రీఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు. సో ఈసినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి. సో.. ఆగస్టు 15 న ఇద్దరికి పోటీ తప్పేలా లేదు. పోటీ ఎందుకులే అని ఇద్దరిలో నుండి ఎవరన్నా వెనక్కి తగ్గుతారేమో చూడాలి.