మగధీర తర్వాత రామ్ చరణ్ మళ్ళీ రంగస్థలం సినిమాతో నటుడిగా ఎంతో ఎత్తుకు ఎదిగాడు. రంగస్థలంలో చిట్టిబాబుగా రామ్ చరణ్ నటుడిగా కొన్నివేల మెట్లు ఎక్కేసాడు. ఆ సినిమాతో రామ్ చరణ్ అందనంత ఎత్తుకు ఎదగడం.. ఆయన తర్వాతి ప్రాజెక్టుల మీద రంగస్థలం ఎఫెక్ట్ బాగా పడడం వంటి వాటితో ప్రస్తుతం రామ్ చరణ్ మార్కెట్ కూడా అసాధారణంగానే పెరిగింది. అందుకే ప్రస్తుతం రామ్ చరణ్, బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్న వినయ విధేయ రామ మీద రంగస్థలం ఎఫెక్ట్ మాములుగా లేదంటున్నారు. ఇక సినిమా మీద భారీ అంచనాలే ఉండడం కాదు.. వినయ విధేయ రామ బిజినెస్ కూడా ఆ లెవల్లోనే జరుగుతుంది.
హీరోయిన్ కైరా అద్వానీ, రామ్ చరణ్ కి జోడిగా నటిస్తున్న ఈ సినిమా కేరళ హక్కులకు భారీ పోటీ ఏర్పడింది. రామ్ చరణ్ రంగస్థలంతో అందుకున్న హిట్ తో రామ్ చరణ్ రేంజ్ ఏ రేంజ్ లో ఉందో ఈ కేరళ హక్కుల పోటీ ద్వారానే స్పష్టమవుతుంది. వినయ విధేయ రామ డిస్ట్రిబ్యూటర్స్ .. ప్రకాశ్ ఫిలిమ్స్ వారు ఈ సినిమాను సంయుక్తంగా కొనుగోలు చేశారని... అయితే ఈ హక్కుల కోసం వాళ్లు భారీ మొత్తం చెల్లించారనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. మరి రంగస్థలం సినిమా కేరళలో కొల్లగొట్టిన కలెక్షన్స్ తోనే ఇప్పుడు వినయ విధేయ రామ సినిమాకి ఇంత డిమాండ్ ఏర్పడిందని అంటున్నారు.
మరి రంగస్థలంలో చిట్టి బాబుగా కుమ్మేసినా రామ చరణ్ ఇప్పుడు వినయ విధేయ రామ తో మాస్ గానూ, క్లాస్ గానూ అదరగొట్టేస్తాడని ఆ సినిమా లుక్స్ తోనే తెలుస్తుంది. ఇప్పటికే వినయ విధేయ రామ టీజర్ కూడా ఆ సినిమా మీద అంచనాలు పెంచుతుంటే.. ఇప్పుడు వినయ విధేయ రామ బిజినెస్ చూస్తుంటే ఆ అంచనాలు మరింత ఎక్కువయ్యేలా కనబడుతుంది. మరి ఈ క్రేజ్ బోయపాటితో వచ్చేకంటే... రామ్ చరణ్‌తో వచ్చిందే ఎక్కువని తెలుస్తుంది.